Begin typing your search above and press return to search.
డీల్ రద్దు ప్రకటన.. పెరిగిన షేరు.. రోజులో ఆయన సంపద అన్ని వేల కోట్లు పెరిగింది
By: Tupaki Desk | 8 July 2021 4:15 AM GMTకలిసి వచ్చేటోడికి నడిచొచ్చే కొడుకు పుడతాడన్నసామెత గుర్తుకు తెస్తుందీ ఉదంతం. కలిసి వచ్చే రోజుల్లో ఏం ముట్టుకున్నా బంగారమే.. అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ పరిస్థితి ఇప్పుడు ఇలానే ఉంది. ఈ మధ్యనే సీఈవో స్థానం నుంచి తప్పుకున్నప్పటికి ఆయన సంపాదన.. సంపదకు మాత్రం ఢోకా లేని విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. తాజాగా ప్రపంచ కుబేరుడి స్థానాన్ని ఆయన పదిలపర్చుకున్నారు. ఒక డీల్ రద్దు కావటంతో అతగాడి సంపద ఒక రోజులో ఎంత భారీగా పెరిగిందో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఆయనతో పోటీ పడే ఎలాన్ మస్క్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతుంటే.. అందుకు భిన్నంగా అమెజాన్ అధినేత ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది.
తాజాగా అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ చేసిన ఒక ప్రకటన అమెజాన్ షేర్లు ఉత్సాహంతో పరుగులు తీసేలా మారాయి. ఆ ప్రతిష్ఠాత్మక సంస్థ 2019లో మైక్రోసాఫ్ట్ కార్ప్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని విలువ దగ్గర దగ్గర 10 బిలియన్ డాలర్లు. క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లుగా పెంటగాన్ ప్రకటించిన వెంటనే.. అమెజాన్ షేర్లు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. దీనికి కారణం.. ఇప్పుడీ డీల్ లో ఎక్కువ భాగం అమెజాన్ కు దక్కే వీలుందని చెబుతున్నారు. ఈ అంచనాతో అమెజాన్ షేరు విలువ రోజులో 5 శాతం పెరిగింది. దీంతో ఆ షేరు విలువ 3676 డాలర్లకు చేరుకుంది.
దీని ఫలితంగా అమెజాన్ లో 11 శాతం షేర్లు ఉన్న జెఫ్ బెజోస్ సంపదఒక్కసారిగా భారీగా పెరిగింది. రోజు వ్యవధిలో ఆయన సంపద 8.4 బిలియన్ డాలర్లు పెరిగినట్లుగా బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ భారీ మొత్తాన్ని రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ.63వేల కోట్లుగా చెప్పాలి. అంటే.. రోజులో అమెజాన్ అధిపతి సంపద రూ.63వేల కోట్లకు పెరిగినట్లుగా చెప్పాలి. వాస్తవానికి వైవాహిక జీవితానికి సంబంధించి జెఫ్ బెజోస్ చేసిన ప్రకటన ప్రకంపనలు రేపింది. భార్యకు విడాకులు ఇవ్వటంతో పాటు భారీగా భరణం ఇవ్వటంతో ఆయన ఆస్తి చాలా మేర తగ్గింది. అయితే.. ఈ మార్చి నుంచి అమెజాన్ షేరు విలువ 20 శాతం పెరిగింది.
దీంతో.. ప్రపంచంలో అత్యధిక సంపద ఉన్న కుబేరుడిగా ఆయన తిరుగులేని స్థానంలో ఉన్నారు. ఆ మధ్యన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 210 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో తగ్గుతూ వస్తోంది. దీనికి భిన్నంగా అమెజాన్ షేర్లు మాత్రం దూసుకెళుతున్నాయి. తాజాగా పెరిగిన షేరు ధర కారణంగా జెఫ్ బెజోస్ సంపద ఎలాన్ కంటే కూడా 30 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కలిసి వచ్చే వాడికి ప్రతిది కలిసి వస్తుందంటే ఇదే మరి.