Begin typing your search above and press return to search.
డియర్ కామ్రేడ్...కేసీఆర్ నియంత ఇప్పుడే అయ్యాడా?
By: Tupaki Desk | 19 Oct 2019 8:06 AM GMTఆర్టీసీ సమ్మె నేపథ్యంలో...రాజకీయపక్షాలు తమ వైఖరిని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. ఒక్కో పార్టీ అధికారంలో ఉన్న గులాబీ పార్టీ పట్ల అనుసరించాల్సిన విషయంలో ఓ క్లారిటీకి వస్తున్నాయి. అయితే, ఈ పర్వంలో కమ్యూనిస్టు పార్టీ అయిన సీపీఐ విధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ సమ్మెకు కార్మికులు సిద్ధమై, ప్రభుత్వం మొండిపట్టుతో ఉన్న సమయంలోనే...కీలకమైన హుజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతివ్వాలని నిర్ణయించింది. "హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని సీపీఐ నిర్ణయించింది.. ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. మోదీ ప్రభుత్వ నియంతృత్వ విధానాలకు నిరసనగా అక్టోబర్ 10 నుంచి 16 వరకు జాతీయస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తాం." అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. తాజాగా ఆయన కేసీఆర్‌ను నియంతగా సూత్రీకరించారు.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో...ఓ మీడియా సంస్థతో మాట్లాడిన చాడా ప్రభుత్వం నుంచి సానుకూలత రానందునే తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగారని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. "కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తున్నారు. తెలంగాణ ప్రజాప్రాతినిధ్యం చేసేందుకు అవకాశం లేదు. వినతిపత్రాలు గిట్టవు. లేదు. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది. గతంలో సీఎంలు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే, ఇప్పుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి నియంత ముఖ్యమంత్రిని చూడలేదు" అని భగ్గుమన్నారు.
అయితే, ఆర్టీసీ సమ్మెను కార్మికులు ప్రకటించిన తర్వాతే టీఆర్ఎస్‌కు చాడా నాయకత్వంలోని సీపీఐ మద్దతివ్వడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల వరకే కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కొనసాగిందని, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని సీపీఐ నిర్ణయించిందని.. ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. ఎన్నికల పొత్తులు ఎవరితో పెట్టుకొన్నా.. సీపీఐ ప్రజల వెంటనే ఉంటుందని చెప్పారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం దృష్టి సారించి, సమ్మెనోటీసులిచ్చిన కార్మికసంఘాలతో చర్చించాలని సూచించారు. అనంతరం..టీఆర్ఎస్‌కు పొత్తు ఉపసంహరించుకున్నారు. తాజాగా....గులాబీ దళపతి కేసీఆర్‌ను నియంతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో...సీనియర్ నేత, కీలక స్థానంలో ఉన్న చాడాకు కేసీఆర్ నియంత అనేది ఇప్పుడు తెలిసిందా? అంటూ పలువురు సెటైర్లు వేస్తున్నారు.