Begin typing your search above and press return to search.
మోడీ మాష్టారు.. చైనావోళ్లు చేసిన పని మనం వెంటనే చేయాలి
By: Tupaki Desk | 2 Dec 2019 6:20 AM GMTఇవాల్టి రోజున జేబులో డబ్బులు ఉన్నా లేకున్నా చేతిలో మొబైల్ ఫోన్.. అది కూడా స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్ అయిపోయింది. మొబైల్ ఫోన్ వాడేందుకు జేబులో డబ్బులు లేదంటే కార్డులు ఉంటే సరిపోయే పరిస్థితి. అదే సమయంలో.. మొబైల్ ఫోన్ కొంటున్నోళ్లు.. వాడుతున్నోళ్లు.. ఇలా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా రికార్డు చేయటం.. లింకు చేయటం లాంటివి చాలా కీలకమన్న విషయాన్ని గుర్తించింది చైనా సర్కారు.
అందుకే కొత్త విధానాన్ని తెర మీదకు తెచ్చింది. మూడు నెలల క్రితం చైనాలో కొత్త రూల్ ను తెర మీదకు తెచ్చారు. దీని ప్రకారం చైనాలో కొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే వారంతా తమ ముఖాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయాల్సింది. దేశ ప్రజలకు పటిష్టమైన సైబర్ భద్రత కల్పించేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.
సెప్టెంబరులో ప్రకటించిన ఈ నిబంధనను నిన్నటి (ఆదివారం) నుంచి అమలు చేస్తున్నారు. దీంతో.. వినియోగదారులంతా తమ అసలు పేర్లు.. చిరునామాలతో పాటు.. వారి ముఖాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీంతో.. ఏ ఫోన్ ను ఎవరు వినియోగిస్తున్నారన్న విషయంతో పాటు.. ఇతర వివరాలు తెలుస్తాయి. లెక్క తేడా వస్తే.. క్షణాల్లో వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఉన్న ఈ విధానాన్ని మన దేశంలోనూ వెంటనే అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి.. మన దగ్గర ఇలాంటి రూల్ ను ప్రధాని మోడీ మాష్టారు ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తారో?