Begin typing your search above and press return to search.
కుండబద్దలు కొట్టేదెవరు? విమర్శించే గొంతు ఆగిపోయింది!
By: Tupaki Desk | 2 Jan 2023 3:30 PM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిచయమున్న ప్రత్యేక పేరు.. `కుండబద్దలు`. ఇది వింతగా ఉన్నప్పటికీ.. అత్యంత తక్కువ కాలం లోనే ప్రజల మధ్యకు వెళ్లింది. వారి అభిమానాన్ని చూరగొనింది. అదే.. కుండబద్దలు యూట్యూబ్ చానెల్. సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు సుబ్బారావు.. తన రాజకీయ, సామాజిక విశ్లేషణలను నిశితంగా ప్రజలకు అందించిన ఛానెల్ ఇంది. `కుండబద్దలు సుబ్బారావు`గా అనతి కాలంలో వినుతికెక్కిన సుబ్బారావు.. మృతి చెందారు. దీంతో విమర్శించే గొంతు ఆగిపోయినట్టు అయింది.
ఎవరీయన.. ఎందుకంత ప్రత్యేకం అంటే.. ఏపీలోని వైసీపీ సర్కారుపై నా, సీఎం జగన్‌పై ఎంతో మంది విమర్శలు చేసేవారు ఉన్నారు. కానీ.. ఏదో నోటికి దొరికింది.. పేపర్లలో చూసింది.. ఎవరో చెప్పగా విన్నవి..ఆధారంగా చేసుకుని విమర్శలు గుప్పించేవా రు. అయితే.. వీరికి భిన్నంగా పక్కా ఆధారాలు, ససాక్ష్యాలతో సంపూర్ణమైన విశ్వసనీయతతో సుబ్బారావు తన కుండబద్దలు యూట్యూబ్ చానెల్‌ద్వారా చేసిన విమర్శలు.. అనతి కాలంలో మేధావులను కూడా ఆకట్టుకున్నాయి. సుబ్బారావు విమర్శలను స్వాగతించిన అధికార పార్టీ తటస్థ నాయకులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం అనిపించకమానదు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సుబ్బారావుకు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టు సంఘాలు సంతాపం తెలిపాయి. సుబ్బారావు.. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన వారు. పలు ఛానల్స్‌లో కూడా ఆయన డిబెట్‌లలో తన వాదనను వినిపించేవారు. షుగర్ సంబంధిత అనారోగ్య సంబంధిత సమస్యతో కొంతకాలంగా గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే సుబ్బారావును పరామర్శించారు. కుటుంబసభ్యులు సుబ్బారావు మృతదేహాన్ని గణపవరానికి తరలించారు. మంగళవారం సుబ్బారావు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల సుబ్బారావుకు పోలీసులు 41ఏ నోటీసులిచ్చిన విషయం తెలిసిందే.
మూడు రాజధానుల విషయంలో కుట్ర పూరితంగా సీఎం జగన్ , రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని రాయదుర్గానికి చెందిన కె.రామాంజనేయులు అనే వ్యక్తి 2020లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. హైకోర్టు తీర్పుతో వెనుకడుగు వేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.