Begin typing your search above and press return to search.
పూడిమడకలో ఆరుగురు విద్యార్థుల మృతి.. అసలు ఏం జరిగింది?
By: Tupaki Desk | 30 July 2022 10:46 AM GMTఅనకాపల్లి జిల్లా పూడిమడక తీరం విషాదాన్ని మిగిల్చింది. జూలై 29న అనకాపల్లి డైట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల్లో 12 మంది పూడిమడక బీచ్ కు వచ్చారు. సరదాగా స్నానానికి దిగినవారిలో ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు జూలై 30న లభ్యమయ్యాయి. 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా విద్యార్థుల కోసం గాలించిన అధికారులు వారి మృతదేహాలను వెలికితీశారు.
గల్లంతైన పవన్ సూర్యకుమార్ (గుడివాడ) గణేశ్(మునగపాక), జగదీశ్(గోపాలపట్నం), రామచందు(యలమంచిలి), విద్యార్థి సతీశ్(గుంటూరు), జశ్వంత్(నర్సీపట్నం)ల మృతదేహాలను వెలికితీశారు.
జూలై 29న డైట్ కళాశాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు మొత్తం 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్‌కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీద కూర్చుని ఉండగా.. 11 మంది సముద్రంలోకి స్నానానికి దిగారు.
కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థులపైకి ఒక పెద్ద అల వచ్చి లాక్కెళ్లింది. దీంతో వారు సముద్రం లోపలికి జారుకున్నారు. కాసేపటికే ఐదుగురు తిరిగి తీరానికి కొట్టుకొచ్చారు. ఏడుగురు మాత్రం బయటికి రాలేకపోయారు.
ఒడ్డు మీద ఉన్న విద్యార్థితో పాటు బయటికి వచ్చిన వారు పెద్దగా అరవడంతో దగ్గర్లో ఉన్న స్థానికులు హుటాహుటిన ఇద్దరిని బయటికి తీసుకొచ్చారు. వారిలో నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్ సూర్యకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థిని అనకాపల్లి జిల్లా మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన నలుగురు విద్యార్థుల కోసం గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టిన విద్యార్థుల మృతితో విషాదం నెలకొంది.
సముద్ర తీరంలో జరిగిన విషాద ఘటనపై సీఎం జగన్ ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనకాపల్లి ఎమ్మెల్యే, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి అమర్ నాథ్ కు ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.