Begin typing your search above and press return to search.

బ్రెజిల్ ‌లో మృత్యుఘోష ... ప్రపంచంలోనే రెండో స్థానం !

By:  Tupaki Desk   |   5 March 2021 7:33 AM GMT
బ్రెజిల్ ‌లో మృత్యుఘోష ... ప్రపంచంలోనే రెండో స్థానం !
X
ఏ రోజున చైనాలో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిందో.. అప్పటి నుంచి ఈ వైరస్ రకరకాల రూపాలను మార్చుకుంటూ ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఎప్పుడు ఏ దేశంలో కరోనా వైరస్ తగ్గుతుందో ఏ దేశంలో మళ్ళీ విజృంభిస్తోందో అర్ధంకాని పరిస్థితి ఏర్పడింది. అసలు కరోనా రూపమేమిటీనేది శాస్త్రజ్ఞులకు అర్ధం కావడంలేదు. తాజాగా మళ్ళీ దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ లో కరోనా విజృంభిస్తోంది.అక్కడ మళ్ళీ ఒక్కసారిగా కరోనా కేసుల నమోదు పెరుగుతుంది. గత మూడు నెలల నుంచి తగ్గుముఖం పట్టిన కేసులు మళ్ళీ పెరుగుతుంది.

ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైంది బ్రెజిల్ ‌లోనే. ఇప్పటివరకు 2,59,271 మరణాలతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉన్నట్టుగా వరల్డో మీటర్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తుందని ఊహించలేదని బ్రెజిల్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మొదట్నుంచి నిర్లక్ష్యమే: కరోనాని కట్టడి చేయడంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో మొదట్నుంచి అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కరోనా వైరస్‌ ని తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. మాస్కులు తప్పనిసరి చేయలేదు. లాక్‌ డౌన్‌ విధించడానికి ఇష్టపడలేదు. ప్రజలు కూడా కరోనా గురించి పెద్దగా పట్టించుకోలేదు.

దీనితో కరోనా వైరస్‌ కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు కరోనా రోగులతో కిటకిటలాడిపోతున్నాయి. బ్రెజిల్‌ లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా నెమ్మదిగా సాగుతోంది. చైనా తయారీ కరోనావాక్, ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ లను ఇస్తోంది. ఇప్పటివరకు 71 లక్షల మందికి ఒక్క డోసు, 21 లక్షల మందికి రెండు డోసులు ఇచ్చింది. కేసుల తీవ్రతకి అమెజాన్‌ అడవులు బాగా విస్తరించిన మానస్‌ నగరం నుంచి నుంచి వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్‌ పీ1 కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనితో ఇది కరోనా తగ్గుతుందని భావిస్తున్న భారత్ వంటి దేశాలకు హెచ్చరిక అని అంటున్నారు. ఎందుకంటే మనదేశంలో కరోనా విజృంభణ తగ్గుతుందని ఊపిరిపీల్చుకుంటున్నాం.. అయితే ఇప్పుడు బ్రెజిల్ దేశంలోని పరిస్థితులు మనకు హెచ్చరికలాంటి సందేశాన్ని ఇస్తున్నట్లు లెక్క అందుకని మనం కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చిందని భరోసా నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్త పడితే మంచిదని నిపుణులు తెలిపారు.