Begin typing your search above and press return to search.
రైలు ప్రమాదాల్లో భారీ దుర్మరణాలు
By: Tupaki Desk | 16 Dec 2015 12:56 PM GMTరైలు ప్రమాదాలు సర్వసాధారణం అయిపోతున్న పరిస్థితుల్లో రైల్వే శాఖ పనితీరుపై దేశంలో ఏటా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అసలింతకు ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నాయి? వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏం చేస్తోంది అన విషయాలను లోక్ సభ వేదికగా ప్రభుత్వం వివరించింది. ఈ క్రమంలో రైల్వే శాఖ మొత్తం ప్రమాదాల లెక్కలు తీయగా ఆశ్చర్యపోయే గణాంకాలు బయటకు వచ్చాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర మంత్రి లోక్ సభ సాక్షిగా ఇచ్చిన వివరాల ప్రకారం మూడేళ్ల వ్యవధిలో రైలు ప్రమాదాలలో దేశంలో 81వేల మంది మరణించారు.
రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా లోక్ సభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం ప్రకారం...2012 సంవత్సరంలో రైలు పట్టాలపై సంభవించిన మరణాలు 16,336 కాగా 2013లో ఆ సంఖ్య 19, 997. ఇక 2014లో రైలు పట్టాలపై మరణించిన వారి సంఖ్య 24.393 కాగా...ఈ ఏడాది నవంబర్ వరకూ 20 వేల 312 మంది మరణించారని వివరించారు. మొత్తంగా 2012 నుంచి ఇప్పటి వరకూ దేశంలో రైలు పట్టాలపై 81వేల మంది మరణించారని ప్రభుత్వం ఈ రోజు లోక్ సభలో వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తాము తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గేట్ల వద్ద కాపలా ఉంచుతున్నామని...అలారం తదితర ఏర్పాట్లు చేశామని వివరించారు.
ఇదిలాఉండగా తాజాగా పిచ్చిపీక్ స్టేజీకి చేరిన ఓ రైలు ప్రమాద ఘటన వివరాలు ఇవి...పాకిస్థాన్ లోని రావల్పిండికి చెందిన రైల్వే ఉద్యోగి జంషేద్ ఖాన్(22) రైలు కదులుతున్న సమయంలో పట్టాలపై నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో రైలు వేగంగా కదలడంతో అతనిపై నుంచి దూసుకెళ్లింది. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు యువకుడి తండ్రి మహ్మద్ పర్వేజ్ కు సమాచారం అందించారు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నది అందుకే మరి.