Begin typing your search above and press return to search.
దేశంలో అప్పులు.. అంబానీ, అదానీలకు ఆస్తులు.. ఎలా పెరిగాయి..?
By: Tupaki Desk | 9 March 2021 10:30 AM GMTఅభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ స్థానం ఎప్పటినుంచో అలాగే ఉంటోంది. కారణం దేశంలోని అసమానతల వల్లేనని కొందరు మేధావులు అంటున్నారు. డబ్బున్నవారి ధనం మరింత పెరుగుతుందని, లేనివారికి మరింతగా కొరత ఏర్పడుతుందని వారి భావన. అయితే ప్రభుత్వాలు మారితే ఎంతో కొంత అభివృద్ధి అవుతుందని ప్రజలంతా కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని గెలిపించారు. బీజేపీ గెలిచినా ఏమున్నది గర్వకారణం.. మొత్తం ప్రైవేటుపరం అని ఇప్పుడు నిట్టూరుస్తున్న పరిస్థితి నెలకొందంటున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రైవేటుకు దోచిపెట్టడమేనన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.
2014లో అధికారంలోకి వచ్చేముందు మోడీ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హీరో అయ్యారు. అప్పటికే మూడు టర్మ్ లు ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కన ఆయన సొంత రాష్ట్రాన్నిబాగానే అభివృద్ధి చేసుకున్నారు. దీంతో దేశ ప్రజలు గుజరాత్ లా దేశం కూడా మారాలన్న ఉద్దేశంతో మోడీని ప్రధానిగా చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితి తారుమారవుతోందని కొందరు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు. అంతకుముందు కంటే ఇప్పటి ప్రభుత్వం అప్పులు మరిన్ని ఎక్కువే చేసిందని, ఇక అభివృద్ధి ఎక్కడుందని కాంగ్రెస్ నేతలు మోడీపై అప్పుడప్పుడు విమర్శల జల్లు కురిపిస్తున్నారు.
దేశంలో ఓ వైపు అప్పలు పెరుగుతుంటే.. మరోవైపు అంబానీ, అదానీ లాంటి ఆస్తులు విపరీతంగా పెరిగాయి. కరోనా సమయంలో ప్రపంచమంతా కార్పొరేట్ కంపెనీలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. కానీ ఇండియాలోని అంబానీ, అదానీలకు చెందిన కంపెనీలు మాత్రం లక్షల్లో లాభాలు సాధించిపెట్టాయి. అయితే ఇలా వీరి సంపద పెరగడానికి కారణం డిస్ ఇన్వెస్ట్మెంట్ కింద పెద్దపెద్ద సంస్థలు తమ వాల్యూయేషన్ తక్కువగా చూపించాయట. అలాగే తక్కువ ధరకు షేర్లు కొని రాత్రికి రాత్రే షేర్లు పెరిగేలా ప్రణాళిక వేశారట.
మరోవైపు ఆ వడ్డీ.. ఈ వడ్డీ అంటూ ప్రభుత్వం ధరలను పెంచుతూ సామన్య ప్రజలపై భారం మోపుతుందని మేధావులు అంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు చెందిన వారు లాభాలు ఆర్జిస్తుంటే సామాన్యులు మాత్రం పరోక్షంగా దేశం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నారంటున్నారు. ఈరోజుల్లో పెట్రోల్ ధరలతో పాటు నిత్యావరసర వస్తువుల ధరలు పెరగడానికి కారణం ప్రభుత్వం అప్పులు తెస్తూ ప్రైవేట్ వారికి లాభం చేకూరుస్తుందన్న విమర్శలు మేధావుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.