Begin typing your search above and press return to search.
వైసీపీ ప్రభుత్వానికి అప్పులు తిప్పలు మామూలుగా లేవుగా!
By: Tupaki Desk | 7 Jan 2023 9:02 AM GMTఏపీలో వైసీపీ ప్రభుత్వానికి అప్పులు తిప్పలు తప్పడం లేదని చెబుతున్నారు. కొత్త సంవత్సరం ప్రవేశించింది. అందులోనూ సంక్రాంతి పండుగ వంటి పెద్ద పండుగ కూడా జనవరిలోనే ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు నెల మొదట్లోనే వేతనాలు చెల్లించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్‌లో రుణం తెచ్చుకోవడానికి రిజర్వు బ్యాంక్ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం ఓపికగా ఎదురుచూసింది. జనవరి 10న వచ్చే మంగళవారం రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొనాలన్నా.. ఇందుకు సంబంధించి రుణదాతలకు అవసరమైన సమాచారం తెలియజేయాలన్నా జనవరి 6నే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ అనుమతులు రావాల్సి ఉంది.
రాష్ట్రాల రుణాలకు సంబంధించి ప్రతి మంగళవారం రిజర్వుబ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలం నిర్వహిస్తుందనే విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అరుదైన సందర్భాల్లో మాత్రమే సోమవారం కూడా అదనంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
ఈ నేపథ్యంలో జనవరి 10న ఆంద్రప్రదేశ్ బహిరంగ మార్కెట్‌లో రుణాల వేలంలో పాల్గొనాలంటే శుక్రవారమే అంటే జనవరి 6నే అనుమతులు రావాలి. సాధారణంగా రిజర్వుబ్యాంకు శుక్రవారం సాయంత్రానికి ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంటుంది. అయితే ఈ వారం మాత్రం చాలా ఆలస్యంగా రాత్రి 7.30 గంటల తర్వాత తన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అప్పటిదాకా ఓపికగా ఎదురుచూసిన ఏపీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారని చెబుతున్నారు.
వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో రుణాలకు ప్రతి రాష్ట్రం తనకు ఎంత అప్పు కావాలో తెలుపుతూ.. సంబంధిత ప్రొఫార్మా పూర్తి చేసి ఆర్బీఐకి పంపుతుంది. ఈ మొత్తానికి కేంద్ర ఆర్థికశాఖ అనుమతులు ఉంటేనే రాష్ట్రాల ప్రతిపాదనలను రిజర్వుబ్యాంకు అనుమతి ఇస్తుంది.
ఈ క్రమంలో ఏపీ తనకు ఎంత అప్పు అవసరమో తెలియజేస్తూ కేంద్రానికి పంపింది. వీటికి శుక్రవారం సాయంత్రానికి కూడా అనుమతులు రాలేదు. దీంతో రాష్ట్ర అధికారులు ఆర్బీఐ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖలో ప్రయత్నాల తర్వాత మూడు నెలల కాలానికి రూ.4,557 కోట్ల అప్పులు తీసుకోవడానికి ఆర్బీఐ నుంచి శుక్రవారం రాత్రి 7.30 గంటలకు అనుమతులు లభించాయి. ఆ తర్వాత దీన్ని నిర్ధారిస్తూ ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది.
కాగా రాష్ట్రంలో జనవరి 6న కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ.1,600 కోట్ల మేర డిసెంబరు నెలకు సంబంధించిన జీతాలు తదితరాలు ఉద్యోగులకు చెల్సించాల్సి ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం రూ.2,200 కోట్ల వరకు ఓవర్ డ్రాఫ్ట్ లోను, వేస్ అండ్ మీన్స్, ప్రత్యేక డ్రాయింగ్ సదుపాయం వెసులుబాటు కలిపి రూ.2,700 కోట్ల వరకు వినియోగించుకున్నట్లు పేర్కొంటున్నారు. అంటే రిజర్వు బ్యాంకుకు ఇప్పటికే రూ.4,900 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం బకాయి ఉందని అంటున్నారు.
ప్రస్తుతం జనవరి 10న నిర్వహించే సెక్యూరిటీల వేలంలో ఏపీ ప్రభుత్వం రూ.2,000 కోట్ల రుణం తీసుకుంటుందని టాక్. ఆ మొత్తం జనవరి 11 నాటికి రానుంది. దీంతో పాటు కేంద్రం... పన్నుల్లో వాటాగా ప్రతి నెలా రాష్ట్రాలకు నిధులు ఇస్తుంటుంది. ఆ మొత్తం రూ.2,300 కోట్లు కూడా అదే సమయానికి అటూ ఇటూగా రానున్నాయని చెబుతున్నారు.
రెవెన్యూ లోటు గ్రాంటు కింద ప్రతి నెలా వచ్చే రూ.859 కోట్లు కూడా అదే సమయానికి వస్తాయని అధికారులు యోచిస్తున్నారు. ఇవన్నీ కలిపి మొత్తం రూ.5,100 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులోకి రాబోతున్నాయని సమాచారం. ఈ నిధులతో జనవరి రెండో వారం నాటికి ప్రభుత్వం రిజర్వుబ్యాంకు బకాయిలు తీరుస్తుందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.