Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ గేమ్స్ తో అప్పులు.. ఆ యువకుడు చివరకు ఏం చేశాడో తెలుసా?

By:  Tupaki Desk   |   25 July 2022 11:30 PM GMT
ఆన్ లైన్ గేమ్స్ తో అప్పులు.. ఆ యువకుడు చివరకు ఏం చేశాడో తెలుసా?
X
మొబైల్ అంటే చాలు ఇప్పుడు అందరికీ వ్యసనంగా మారిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే పూటగడవదు. ఇక పిల్లలు అయితే మొబైల్ గేమ్స్ కు అడిక్ట్ అయిపోయారు. ఈ గేమ్స్ ఎందరినో వ్యసనంగా మార్చేస్తున్నాయి. చాలా మంది డబ్బులు పెట్టి మరీ ఆన్ లైన్ గేమ్స్ ఆడి సర్వం కోల్పోతున్నారు. తాజాగా ఆన్ లైన్ గేమ్స్ ఆడి అప్పుల పాలైన యువకుడు షాకిం్ నిర్ణయం తీసుకున్నాడు.

ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం శంకరానికి చెందిన రమణయ్య-నారాయణమ్మలకు ఇద్దరు పిల్లలు. వారిది రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. వీరి కుమారుడు చిన్ని కృష్ణ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగానికి కుదిరాడు.ఈ దశలోనే ఆన్లైన్ గేమ్స్ కు బానిస అయ్యాడు.

గేమ్స్ ఆడుతూ డబ్బులు కోల్పోవడం.. అప్పులు తీసుకోవడం.. మళ్లీ డబ్బులు కోల్పోవడం జరుగుతూనే ఉంది. ఇలా రెండు లక్షల రూపాయల వరకూ అప్పు పేరుకుపోయింది. అందులో లక్షా 60 వేల రూపాయలు అప్పు చెల్లించాడు. మిగతా 40వేల రూపాయలు కట్టమని సదురు సంస్థ ప్రతినిధులు ఒత్తిడి తేవడంతో సొంత ఊరు కనిగిరికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

స్మార్ట్ ఫోన్ ఆన్ లైన్ గేమ్ కు అడిక్ట్ అయిన చిన్ని కృష్ణ అనే 18 ఏళ్ల యువకుడు.. దాదాపు 2 లక్షల రూపాయాలు అప్పులో కూరుకుపోయి చివరికి తనువు చాలించాడని తల్లిదండ్రులు బోరున విలిపిస్తూ తెలిపారు. .

ఇతడే కాదు చాలా మంది మొదట సరదాగా ఆన్ లైన్ గేమింగ్ లకు అలవాటు పడుతున్నారు. బానిసగా మారుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో యువత, స్కూలు పిల్లలు ఎక్కువగా రమ్మీకి అలవాటు పడుతున్నారు. భారీగా డబ్బులు పెట్టి ఆడుతున్నట్టు తెలుస్తోంది.

మోసపోయి డబ్బులు మొత్తం పోగొట్టుకుంటున్న ఫిర్యాదులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రమ్మీ పేరిట జరుగున్న మోసాలు కూడా విచ్చలవిడిగా ఏపీలో నమోదవుతున్నాయి. ఎక్కువ మంది ఇందులో డబ్బులు పోగొట్టుకుంటున్నామని ఫిర్యాదు చేస్తున్నారు.