Begin typing your search above and press return to search.

ఐదు పంచాయితీల్ని జీవీఎంసీ లో విలీనం చేస్తూ నిర్ణయం

By:  Tupaki Desk   |   25 Jan 2020 4:34 AM GMT
ఐదు పంచాయితీల్ని జీవీఎంసీ లో విలీనం చేస్తూ నిర్ణయం
X
ఏపీ రాజధానిగా విశాఖను ఎంపిక చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే.. ఇందుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదముద్ర వేయగా.. మండలిలో బ్రేకులు పడి సెలెక్ట్ కమిటీకి వెళ్లింది. ఈ నేపథ్యంలో రాజధాని ఏర్పాటు ప్రక్రియ నెమ్మదించినట్లుగా భావిస్తున్నారు. ఇలాంటివేళ.. ఏపీ సర్కారు తన ఆలోచనల్ని స్పష్టం చేసేలా మరో నిర్ణయాన్ని తీసుకుంది.

విశాఖ మహానగరం చుట్టూ ఉన్న ఐదు పంచాయితీల్ని నగరంలో విలీనం చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ కీలక నిర్ణయానికి ఏపీలోని జగన్ సర్కారు ఓకే చేసింది. విశాఖ లో సచివాలయం తో పాటు.. పలు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారని భావిస్తున్న వేళ.. ఐదు పంచాయితీల్ని విశాఖ లో విలీనం చేయటం గమనార్హం. సచివాలయాన్ని నిర్మిస్తారని చెబుతున్న కాపులుప్పాడు పంచాయితీ కూడా తాజాగా విలీనం చేసిన పంచాయితీల్లో ఉంది.

అధికారిక ఉత్తర్వులతో పాటు.. రాజపత్రాన్ని ప్రింట్ చేసేందుకు వీలుగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఇక.. విశాఖ మహానగరంలో విలీనం కానున్న ఐదు పంచాయితీల్ని చూస్తే..

1. నగరపాలెం
2. కాపులుప్పాడ
3. చేపలుప్పాడ
4. నిడిగట్టు
5. జేవీ ఆగ్రహారం

తాజా నిర్ణయాన్ని చూస్తే..విశాఖను రాజధాని గా ఏర్పాటు చేసే విషయం లో జగన్ సర్కారుకున్న కమిట్ మెంట్ ఎంతో చెప్పేస్తుందని చెప్పాలి. రాజధాని ఏర్పాటుకు సంబంధించిన కొన్ని అంశాలు పెండింగ్ లో పడిన నేపథ్యంలో.. మిగిలిన అంశాల్ని ఒక్కొక్కటి పూర్తిచేస్తూ.. రాజధాని ఏర్పాటు కు అవసరమైన పనుల్ని యుద్ధ ప్రాతి పదికన చేపడుతున్నట్లు గా చెప్పక తప్పదు.