Begin typing your search above and press return to search.
భగవద్గీతకు జాతీయ హోదా
By: Tupaki Desk | 23 Dec 2015 5:58 AM GMTభగవద్గీత...హిందూ సమాజంలో... సరిగ్గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస గ్రంథం. అంతటి ఉతృష్ట గ్రంథం మరోసారు దేశవ్యాప్తంగా తెరమీదకు వచ్చింది. భగవద్గీతను 'జాతీయ గ్రంథం'గా ప్రకటించాలని లోక్ సభలో బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. జీరో అవర్ లో ఆ పార్టీ సభ్యుడు యోగి ఆదిత్యనాథ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. 'జిహాదీ' ఉగ్రవాదంపై యావత్ ప్రపంచం ఆందోళన చెందుతున్న ఈ సమయంలో భగవద్గీత బోధనలు సందర్భోచితంగా ఉంటాయని ఆయన అన్నారు. మానవత్వానికి ఈ పవిత్ర గ్రంథం దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు. భగవద్గీతను పాఠ్యాంశాలలో భాగంగా చేర్చాలని సూచించారు. యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ కు ఆ పార్టీ సభ్యులందరూ బల్లలు చరుస్తూ మద్దతు పలికారు. యథావిధిగా ప్రతిపక్ష కాంగ్రెస్ - లౌకికవాదులు అని చెప్పుకొనే వామపక్షాల ఎంపీలు దీనిపై తమ అభ్యంతరాన్ని తెలిపారు.
కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ హిందువుల పవిత్ర మతగ్రంథమైన భగవద్గీతను ప్రభుత్వం జాతీయ పవిత్ర గ్రంథంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ఏడాది భగవద్గీతకు 5,151 ఏళ్లయిన సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించిన గీతా ప్రేరణ మహోత్సవ్‌లో సుష్మ మాట్లాడారు. దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు గీతలో జవాబులు ఉన్నాయని అందుకే భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని సుష్మా డిమాండ్ చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ప్రధాని మోడీ గీతను కానుకగా ఇవ్వడంతో దానికి ఇప్పటికే జాతీయ పవిత్రగ్రంథం హోదా దక్కింది. ఇక ఆ హోదాను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది’ అని అన్నారు.
ప్రపంచంలోనే మొట్టమొదటి పర్సనాలిటీ డెవలప్ మెంట్ ట్రైనర్ అయిన శ్రీకృష్ణుడి అనుభవసారమే గీత అనే విషయం మనందరికీ తెలిసిందే. జీవితంలోని ప్రతిదశలో ఎదురయ్యే సవాళ్లను, సందర్భాలను విజయవంతంగా దాటుకొని వెళ్లే నైపుణ్యాలన్నీ గీతలో మిళితం అయి ఉన్నాయి.