Begin typing your search above and press return to search.

3 రాజధానులకు సపోర్ట్.. బలికాబోతున్న చిరంజీవి

By:  Tupaki Desk   |   27 Feb 2020 11:00 AM GMT
3 రాజధానులకు సపోర్ట్.. బలికాబోతున్న చిరంజీవి
X
మెగా స్టార్. తెలుగు వారి కలల హీరో.. అందరివాడు.. అలాంటి చిరంజీవి ఏపీలోని రాజకీయ పరమైన నిర్ణయానికి బలి కాబోతున్నారు. ఏపీకి మూడు రాజధానులు ప్రకటించిన సీఎం జగన్ నిర్ణయాన్ని గతంలో చిరంజీవి సపోర్టు చేసినట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై చిరంజీవి మాత్రం అధికారికంగా స్పందించలేదు. అయితే చిరు మూడు రాజధానులకే సపోర్టుగా ఉన్నారని అమరావతి రైతులు ఫిక్సయ్యారు. దీంతో చిరంజీవిని బుక్ చేశారు. తాజా పరిణామంతో చిరంజీవి చిక్కుల్లో పడ్డారు.

అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ తాజాగా సంచలన ప్రకటన చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇంటి ఎదుట దీక్షకు దిగుతామని ప్రకటించింది. హైదరాబాద్ లోని చిరంజీవి ఇంటి ఎదుట ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేస్తామని ప్రకటనలో పేర్కొంది.

వెంటనే అమరావతి రైతులకు చిరంజీవి మద్దతు తెలిపాలని జేఏసీ డిమాండ్ చేసింది. లేకుండా అమరావతి మద్దతుదారులంతా చిరంజీవి ఇంటిని ముట్టడిస్తారని.. పెద్దఎత్తున దీక్షకు తరలివస్తారని పేర్కొంది. ప్రస్తుతం చిరంజీవి ఇంటి ఎదుట దీక్ష చేస్తామని ప్రకటించిన జేఏసీ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ లోనూ కలకలం రేపుతోంది.