Begin typing your search above and press return to search.
పోయెస్ గార్డెన్ కూడా దీప - దీపక్ కే.. ప్రభుత్వానికి - శశికళకు షాక్
By: Tupaki Desk | 29 May 2020 7:15 AM GMTతమిళనాడు మాజీ ముఖ్యమంత్రి - అలనాటి సినీనటి జయలలిత మరణించిన తర్వాత ఆమె ఆస్తి విషయంలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ ఆస్తిపై ప్రభుత్వంతో పాటు జయలలిత స్నేహితురాలు శశికళ - జయలలిత మేనకోడలు దీప - మేనల్లుడు దీపక్ కన్నేశారు. అయితే ప్రభుత్వం - శశికళ వర్గానికి షాకిచ్చేలా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. మేనల్లుడు దీపక్ - మేనకోడలు దీపకే జయలలిత ఆస్తులు సంభవించే అవకాశం ఉంది. ఈ మేరకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసందే. అయితే ప్రభుత్వం మాత్రం జయలలిత తుదిశ్వాస వరకు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో అత్యంత విలాసవంతంగా నివసించిన భవనాన్ని స్మారక మందిరంగా చేస్తామని ప్రకటించి ఆ మేరకు ఆర్డినెన్స్ తీసుకురావడం, గవర్నర్ తో ఆమోద ముద్ర వేయించడం జరిగింది.
జయలలితకు రూ.వందల కోట్ల ఆస్తులున్నా పోయెస్ గార్డెన్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. జయకు సొంతమైన వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తికి ఆమె అన్న కుమార్తె దీప - కుమారుడు దీపక్ వారసులని మద్రాసు హైకోర్టు తేల్చడంతో ఇప్పుడు వారికే చెందే అవకాశం ఉంది. జయలలితకు తాము వారసులమని - ఆమె ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను తమకు అప్పగించాలని దీప - దీపక్ మద్రాసు హైకోర్టులో పిటిషన్లపై బుధవారం ఇచ్చిన తీర్పు వారికి సానుకూలంగా వచ్చింది. చట్ట ప్రకారం వారిద్దరూ జయ ఆస్తికి రెండోతరం వారసులని కోర్టు స్పష్టం చేస్తూనే జయ ఆస్తులపై పర్యవేక్షణాధికారం వారిద్దరికీ ఉంటుందని వెల్లడించింది.
ఈ క్రమంలోనే పోయెస్ గార్డెన్ లోని ఇంటిని జయ స్మారక మందిరంగా మార్చాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సింది ప్రభుత్వానికి కోర్టు సూచించింది. చెన్నై పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం తమ పూర్వీకుల ఆస్తి - ఆ భవనం తమకు సొంతమని కోర్టు ఇచ్చిన తీర్పు తమకు సంతోషం ఇచ్చిందని దీప తెలిపారు. పోయెస్ గార్డెన్ ఇంటిని స్మారకమందిరంగా మార్చడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు. జయలలితకు సంబంధించిన ఆస్తులన్నీ తమకే సొంతమని ప్రకటించారు. అన్ని సమస్యలు పరిష్కారం కాగానే పోయెస్ గార్డెన్ లోనే నివసిస్తాం.
పోయెస్ గార్డెన్ ఇల్లు తమకు వారసత్వంగా సంక్రమించిన ఆస్తి - దాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు తీసుకొచ్చిన చట్టాన్ని అంగీకరించమని జయలలిత మేనల్లుడు దీపక్ తెలిపారు. వేద నిలయాన్ని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా చేయాలన్న సూచన సరికాదని కొట్టిపారేశారు.
ఈ కోర్టు తీర్పు - తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు జయలలిత ఆప్త స్నేహితురాలు శశికళకు కొత్త చిక్కులు వచ్చాయి. ఆస్తంతా మేనల్లుడు - మేనకోడలుకు వెళ్తుంటే మిగతా ఆస్తులు కూడా వారికే చెందనున్నాయి. జయలలిత - శశికళ కలిసి అనేక సంస్థలు నిర్వహించేవారు. వారిద్దరికి భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు వాటిల్లో జయ వాటాను దీప - దీపక్ లకు కేటాయించాల్సిందే. కొడనాడు ఎస్టేట్ - తెలంగాణ హైదరాబాద్ లోని ద్రాక్ష తోట వివాదాలు కూడా కోర్టు తీర్పు పరిష్కారమయ్యేలా ఉన్నాయి.