Begin typing your search above and press return to search.

అమ్మ వారసురాలు తానేనన్న దీప

By:  Tupaki Desk   |   17 Jan 2017 8:03 AM GMT
అమ్మ వారసురాలు తానేనన్న దీప
X
అమ్మ జయలలిత మేనకోడలు దీప గొంతు విప్పారు. అమ్మ మరణం తర్వాత ఆమె వారసత్వం తనదేనన్నవ్యాఖ్య చేసిన దీప తాజాగా తన రాజకీయ రంగప్రవేశం గురించి కీలకవ్యాఖ్యలు చేశారు. అమ్మ మరణం తర్వాత పార్టీలో కీలక పదవిని కోరుకున్న దీప.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా మౌనంగా ఉండిపోయారు. అమ్మనెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలు అందుకునేందుకు పావులు కదపటం.. పార్టీ ముఖ్యనేతలంతా శశికళ వెంట నడవటంతో.. దీప అప్పట్లోకాస్త దూకుడు తగ్గించారు.

అయితే.. నిత్యం ఆమె ఇంటికి అన్నాడీఎంకే కార్యకర్తులు పోటెత్తటం.. ద్వితీయశ్రేణి నాయకత్వం ఆమెను సంప్రదించటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో.. సమయం వచ్చినప్పుడు తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడతానని చెప్పిన దీప.. నెల వ్యవధిలోనే తన మైండ్ సెట్ ను మార్చుకోవటం గమనార్హం.

ఈ రోజు (జనవరి 17న) తన రాజకీయ రంగ ప్రవేశం గురించి దీప కీలకప్రకటన చేస్తారన్న వార్తలు ఒకవైపు.. లేదు.. లేదు ఆమెకొత్త పార్టీని ప్రకటించే వీలుందన్న వాదనలు వినిపిస్తున్నవేళ.. దీప గొంతు విప్పారు. విలేకరులతో మాట్లాడటానికి ముందు.. అమ్మ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించిన ఆమె.. మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ రంగప్రవేశం ఎప్పుడో జరిగిపోయినట్లుగా వ్యాఖ్యానించారు.

అమ్మమృతి మీద తనకు ఎలాంటి సందేహాల్లేవని.. తన సోదరుడు ఆసుపత్రిలో అమ్మ దగ్గరే ఉన్నారని గుర్తుచేశారు.తమిళనాడు ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పిన ఆమె.. అమ్మ పుట్టినరోజైన ఫిబ్రవరి 24న తన రాజకీయ భవిష్యత్ ప్రణాళిక గురించి ప్రకటన చేస్తానని ఆమె వ్యాఖ్యానించారు. అమ్మ జయలలిత ఆశయ సాధనకు పాటుపడతానని చెప్పిన దీప.. అమ్మకు అసలైన వారసురాలిని తానేనని చెప్పుకొచ్చారు.

అన్నాడీఎంకే పార్టీకి చెందిన మెజార్టీ కార్యకర్తలు తన వెంటే ఉన్నారన్న విషయాన్ని చెప్పిన దీప..అమ్మ అడుగుజాడల్లోనే తాన నడుస్తానన్నారు. కార్యకర్తలు తనపై పెట్టుకున్న నమ్మకాన్నివమ్మూ చేయనని చెప్పారు. తమిళనాడు ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పారు. తన ప్రతి మాటకు ముందు.. చివరన అమ్మ ప్రస్తావన తీసుకొస్తూదీప మాట్లాడటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/