Begin typing your search above and press return to search.
అమ్మ మేనకోడలు కనిపించటం లేదు!
By: Tupaki Desk | 31 Oct 2017 8:35 AM GMTతమిళనాడులో మరో సంచలనం చోటు చేసుకుంది. అమ్మ జయలలిత మేనకోడలు.. అమ్మకు అసలుసిసలు వారసురాలిగా తనను తాను చెప్పుకునే దీప జయకుమార్ కనిపించకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అమ్మ మరణం తర్వాత అనూహ్య పరిణామాల్లో తెర మీదకు రావటమే కాదు.. తన వాణితో అందరి దృష్టిని దీప ఆకర్షించారు. అమ్మ మరణం కారణంగా ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానంలో ఆమె బరిలోకి దిగాలని ప్రయత్నించారు.
ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక.. తాజాగా ఆమె కనిపించకపోవటానికి ఇంటి విభేదాలే కారణంగా చెబుతున్నారు. దీపకు ఆమె భర్తకు మధ్యన విభేదాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరూ విడివిడిగా ఉన్నా.. ఆ మధ్యన కలుసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి దీపకు ఆమె భర్త మాధవన్ కు మధ్య విభేదాలు తలెత్తినట్లుగా చెబుతున్నారు. వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలోనే దీప శుక్రవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది.
గడిచిన వారంలో దీప డ్రైవర్ రాజా తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు ఆమె భర్త మాధవన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీప స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. తన భర్త చేసిన ఫిర్యాదులో నిజం లేదని ఆమె చెప్పారు. ఇది జరిగిన తర్వాతే ఆమె ఇంటి నుంచి వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సమయం దగ్గరకు వస్తున్న వేళ.. దీప కనిపించకుండా పోవటం పలు సందేహాలకు తావిస్తోంది. ఆమె అనుచరులు కంగారుపడుతున్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని దీప ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు.. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తాను బరిలోకి దిగనున్నట్లు చిన్నమ్మ మేనల్లుడు దినకరన్ వెల్లడించటం తెలిసిందే. ఇంతకీ.. దీప ఎక్కడికి వెళ్లినట్లు? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.