Begin typing your search above and press return to search.
కొత్త పార్టీ ..ఎంజీఆర్..జయలలిత అన్నాడీఎంకే
By: Tupaki Desk | 9 Jan 2017 6:25 AM GMTతమిళనాడ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. అమ్మ జయలలిత మరణం తర్వాత..ఆమె వారసత్వాన్ని కోరుకున్న ఆమె మేనకోడలు దీప కొత్త పార్టీ పెట్టేందుకుఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. దీపకు మద్దతుగానిలించేందుకు అన్నాడీఎంకేకు చెందిన ద్వితీయ.. తృతీయ శ్రేణి నేతలు పెద్దఎత్తున ఆమె వద్దకు వస్తున్నారు.
గతంతో పోలిస్తే.. ఈ మధ్య కాలంలో తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అమ్మను అభిమానించే వారు ఎక్కువగా దీప ఇంటి వద్దకు వస్తున్నారు. ఆమెనురాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. రోజురోజుకి పెరుగుతున్న అభిమానుల తాకిడితో తన రాజకీయ రంగ ప్రవేశానికి ఏర్పాట్లు మొదలెట్టిన దీపకు మద్దతుగా నిలిచేందుకు వీలుగా ఈరోడ్ లో కొత్త పార్టీని ఏర్పాటు చేయటం గమనార్హం.
జంట రోజాల చిహ్నంతో ఉన్న ఈ కొత్త పార్టీకి ఎంజీఆర్.. జయలలిత అన్నాడీఎంకే అన్న పేరు పెట్టారు. ఇదిలా ఉంటే.. అమ్మను అభిమానిస్తూ.. దీపకు మద్దుతుగా నిలిచే వారందరిని ఏకం చేసేందుకు కొత్త ప్రయత్నాలు మొదలయ్యాయి. తమిళనాట వ్యాప్తంగా ఉన్న అమ్మ అభిమానుల్ని ఏకం చేసేందుకు దీప ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. చిన్నమ్మ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్ననేతలతో ఆమె చర్చలు మొదలెట్టారు.
దీప ప్రయత్నాల నేపథ్యంలో.. అన్నాడీఎంకేలో చీలిక ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చివరకు ఇదెంత వరకూ వెళ్లిందంటే.. చిన్నమ్మే స్వయంగా పార్టీలో చీలిక ఉండే అవకాశమే లేదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాల వారీగా జరుపుతున్న సమీక్షా సమావేశాల్ని నిర్వహిస్తున్న చిన్నమ్మ.. నేతలతో మాట్లాడుతూ.. పార్టీలో చీలిక వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా జిల్లాల్లో నేతలంతా కేడర్ కు అందుబాటులో ఉండాలన్న సూచన చేసిన చిన్నమ్మ.. పార్టీకి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాల్ని నమ్మ వద్దని కోరుతున్నారు. అమ్మ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు వెళదామన్న పిలుపునిస్తున్న చిన్నమ్మ మాటలపై పార్టీ నేతలు.. కార్యకర్తలు ఎంత నమ్మకం పెట్టుకుంటారో చూడాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/