Begin typing your search above and press return to search.
ఆమె ఇంటికి జనం పోటెత్తుతున్నారు
By: Tupaki Desk | 5 Jan 2017 7:19 AM GMT‘అమ్మ’తో తనకున్న అనుబంధం గురించి చెప్పటం.. అమ్మకు సంబంధించిన హక్కులు తమకున్నాయంటూ సంచలన వ్యాఖ్యలతో తెర మీదకు వచ్చిన జయలలిత సోదరుడి కుమార్తె దీప వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. అనారోగ్యంతో అమ్మ ఆసుపత్రిలో చేరిన తర్వాత దీప మీడియా ముందుకు వచ్చి.. తనను తాను అమ్మ మేనకోడలిగా పరిచయం చేసుకున్నారు. తన తండ్రి సోదరిని కలుసుకోకుండా భద్రతా సిబ్బంది అడ్డుకోవటంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమ్మ మరణం తర్వాత ఆమె వారసత్వాన్ని పొందాలని ట్రై చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. అయితే.. అమ్మను అభిమానించే కొందరు మాత్రం.. ఆమెకు పార్టీలో స్థానం కల్పించాలని..పగ్గాలు అప్పజెప్పాలంటూ పోస్టర్లు వేశారు. వీటికి మీడియాలో ప్రాధాన్యత లభించటంతో.. దీప ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటివరకూ ఆమెపై పెద్దగా అంచనాలు లేని స్థాయి నుంచి.. కొందరు అన్నాడీఎంకే నేతలు ఆమెను అంతర్గతంగా చర్చలు మొదలు పెట్టినట్లు చెబుతారు.
ఆమె అంత ప్రభావాన్ని చూపించే అవకాశం లేనప్పటికీ.. ఎంతోకొంతమందిని అయితే ఆకర్షించారనటంలో సందేహం లేదు. పార్టీలో చిన్నమ్మకు ధీటుగా నిలుస్తారన్నప్రచారం జరిగినప్పటికీ.. ఆమె మాత్రం అందుకు భిన్నంగా వెనక్కి తగ్గారు. తానుసరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని.. అప్పటివరకూ వెయిట్ చేయాలంటూ తనను అభిమానిస్తున్న వారికి చెప్పుకొచ్చారు. అమ్మ మాదిరి హావభావాలతో మాట్లాడే ఆమెను చూసేందుకు అన్నాడీఎంకే కార్యకర్తలు పలువురు ఆమె ఇంటి వద్దకు చేరుకుంటున్నారు.
ఆసుపత్రిలో అమ్మకు అందించిన వైద్యంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్న ఆమె.. చికిత్స వివరాల్ని బహిర్గతం చేయాలని చెబుతున్నారు. తన గురించి కొన్ని పత్రికల్లో ఊహాల ఆధారంగా వార్తలు ప్రచురిస్తున్నారన్న ఆమె.. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మూడు వారాల్లో ప్రకటన చేస్తానని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె ఇంటికి నిత్యం పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలు.. అభిమానులు వస్తున్నారు. ఆమె ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమిగూడి ఆమె ఎప్పుడు బయటకు వస్తారా? అని ఎదురుచూస్తున్నారు.
ఇలా వస్తున్న వారిని పలుకరించేందుకు వీలుగా దీప.. తన ఇంటి పై అంతస్తు నుంచి చేతులూపి వారికి అభివాదం చేస్తున్నారు. నిత్యం తనను చూసేందుకు వస్తున్న జన సందోహాన్ని చూసిన ఆమె చాలా ఆనందంగా ఉంటున్నట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ ప్రకటన లేకున్నా.. దీపను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఆమె నివాసానికి వెళ్లటం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. మరి మూడు వారాల్లో దీప నోట వచ్చే మాట ఏమిటన్న అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/