Begin typing your search above and press return to search.
ఇంటికొచ్చినోళ్ల డిటైల్స్ తో ‘దీప’ రిజిస్టర్
By: Tupaki Desk | 6 Jan 2017 8:09 AM GMTతమిళనాడులో పరిణామాలు ఒకటి తర్వాత మరొకటి చొప్పున మారిపోతున్నాయి. అమ్మ స్థానాన్ని చిన్నమ్మ చేజిక్కించుకోవటం ఒక పరిణామం అయితే.. చాప కింద నీరులా అమ్మ వారసత్వం తనకు మాత్రమే సొంతమని మొదటి నుంచి వాదిస్తున్న దీప.. ఇప్పుడా దిశగా నడకను మొదలెట్టినట్లు చెప్పాలి. చిన్నమ్మ అంటే గుర్రుగా ఉన్నోళ్లు.. అమ్మను చూసిన కంటితో చిన్నమ్మను చూసేందుకు ఇష్టపడని వారు.. అమ్మ వారసత్వం చిన్నమ్మకు ఎలా అవుతుంది? అన్న ఫీలింగ్ ఉన్న చాలామంది దీప వద్దకు వెళుతున్నారు. అమ్మ జయలలిత అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన తర్వాత.. మేనత్తను చూడటానికి సెక్యూరిటీ అనుమతించకపోవటంతో మీడియాను ఆశ్రయించటం ద్వారా దీప అందరికి సుపరిచితులయ్యారు.
అప్పటి నుంచి ఇప్పటివరకూ నిరాదరణ ఎదుర్కొంటున్న దీప అంటే చాలామందిలో సానుభూతి వ్యక్తమవుతోంది. దీనికి తోడు హావభావాలు.. మాట్లాడే విధానంలో అమ్మను గుర్తుకు తెస్తున్న దీపను జయ వారసురాలిగా భావిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అన్నాడీఎంకే పార్టీలోకి తనకు స్థానం కల్పించాలన్న డిమాండ్ చేసినప్పటికీ.. ఎలాంటి స్పందన లేకపోవటంతో.. సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నం చేశారు దీప.
అయితే.. పరిస్థితులు అనుకూలంగా లేవన్న కారణంగా వెనక్కి తగ్గిన ఆమె.. ఏదో రోజున తాను రాజకీయాల్లోకి వచ్చేది ఖాయమంటూ పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆమె సైతం ఊహించని రీతిలో పలువురు అన్నాడీఎంకే కిందిస్థాయి నేతలు.. కార్యకర్తలు.. అమ్మ అభిమానులు దీప ఇంటికి వెళుతున్నారు. ఆమెను చూడాలని.. ఆమె మాటల్ని వినాలని తపిస్తున్నారు. ఇదంతా చూస్తున్న ఆమె ఆనందానికి గురి అవుతున్నారు. ఓ మోస్తరు నేతల్ని ఇంటికి ఆహ్వానించి మాట్లాడి పంపిస్తున్నారు. పనిలో పనిగా.. వారి వివరాల్ని సేకరిస్తూ.. ఒక రిజిస్టర్ ను మొయింటైన్ చేయటం గమనార్హం.
దీపను చూసేందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తమిళనాడు వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వారి రాకతో దీపలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. దీనికి తగ్గట్లేఆమె మాటలోనూ కాస్త మార్పు వచ్చింది. తనను చూసేందుకు వస్తున్న కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న దీప.. జయలలిత ప్రతిష్ట.. గౌరవ మర్యాదల్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని.. తన రాజకీయ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేస్తున్నారు. కీలకమైన నిర్ణయాన్ని సరైన సమయంలో ప్రకటిస్తానని చెబుతున్న ఆమె.. ఇప్పుడు మాత్రం రాజకీయ అంశాలపై జోరుగా చర్చలుజరుపుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/