Begin typing your search above and press return to search.
చిన్నమ్మకు అడ్డంతిరిగిన అమ్మ మేనల్లుడు
By: Tupaki Desk | 23 Feb 2017 4:43 PM GMTఅన్నాడీఎంకే నేత పళనిస్వామి సీఎం పీఠం అధిరోహించడం, పన్నీరు సెల్వం హవా తగ్గడంతో శాంతించాయని భావిస్తున్న అమ్మ పార్టీ రాజకీయ పరిణామాల్లో ఊహించని ట్విస్ట్ నెలకొంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మేనల్లుడు దీపక్ జయకుమార్ చిన్నమ్మకు ఎదురుతిరిగారు. పార్టీ నడిపేందుకు చిన్నమ్మకు మద్దతు ఇస్తాను కానీ తమ మేనత్త ఆస్తులైన పోయెస్ గార్డెన్‌ను సొంతం చేసుకుంటానంటే సహించేది లేదని తేల్చిచెప్పారు. తద్వారా అన్నాడీఎంకేను, అమ్మ ఆస్తులను తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న చిన్నమ్మ శశికళకు షాక్ ఇచ్చారు. అదే సమయంలో చిన్నమ్మను మొదటి నుంచి ప్రశ్నిస్తున్న జయలలిత కోడలు-తన సోదరి దీపా జయకుమార్‌కు మద్దతు ఇచ్చారు!
తమిళనాడులో ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో అమ్మ ఆస్తి అయిన పోయెస్ గార్డెన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. జయలలిత మృతి తర్వాత పన్నీరు సెల్వం సీఎంగా ఉన్నప్పుడు.. శశికళకు దక్కకుండా దానిని స్మారక కేంద్రంగా చేయాలని భావించారు. ఆ దిశగా అడుగులు వేసినప్పటికీ పోయెస్ గార్డెన్‌లో శశికళ కుటుంబ సభ్యులు ఉంటుండటంతో అది కుదరలేదు. పైగా శశికళ జైలుకెళ్లడం, ఆమె వర్గం నేత పళనిస్వామి సీఎం కావడంతో పోయెస్ గార్డెన్ అంశం పక్కకు పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోయెస్ గార్డెన్ అంశంపై దీపక్ జయకుమార్ తొలిసారి స్పందించారు. పోయెస్ గార్డెన్ పైన శశికళకు హక్కు లేదని చెబుతూ.. పార్టీని ఆమె నడుపవచ్చునని, కానీ ఆమె కుటుంబ సభ్యులకు హక్కులేదని చెప్పారు. తాను హక్కులు మాత్రమే కోరడం లేదని బాధ్యతలను సైతం పంచుకుంటానని దీపక్ చెప్పారు. జయలలిత పైన సుప్రీంకోర్టు విధించిన జరిమానాను చెల్లించేందుకు సిద్ధమని అవసరమైతే తన ఆస్తులు అమ్మి జరిమానా కడతానని చెప్పారు. కానీ పోయెస్ గార్డెన్ మాత్రం తన సోదరి దీపది, తనది మాత్రమే అన్నారు. పోయెస్ మాది అని ఇతరులకు ఎవరికీ చెప్పే హక్కు లేదని దీపక్ స్పష్టం చేశారు. తమ అత్త ఆస్తులకు తామే హక్కుదారులమని తేల్చిచెప్పారు. అలా అని తనకు రాజకీయాల పైన ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు.
ఇదే సమయంలో తమ మేనత్త సహచరిగా ఉన్న శశికళ విషయంలో ఒకింత సానుబూతి చూపించారు. శశికళను పార్టీ అధినేత్రిగా తాను అంగీకరిస్తానని అయితే బంధువులైన టీటీవీ దినకరన్, వెంకటేష్‌లకు అన్నాడీఎంకే పార్టీని నడిపే హక్కు లేదని దీపక్ స్పష్టం చేశారు. శశికళ బలవంతంగా పార్టీని తమ వారి చేతిలోకి తీసుకుంటోందని, దీన్ని పార్టీ క్యాడర్ దానిని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించదని చెప్పారు. ఇలాగే జరిగితే పార్టీలో చీలిక వస్తుందని తద్వారా ప్రతిపక్ష స్టాలిన్ అధికారంలోకి వస్తారని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గురించి దీపక్ స్పందిస్తూ ఆయన బాగా పాలించారని కితాబిచ్చారు. మంచి ముఖ్యమంత్రిగా తాను పన్నీర్‌ను గౌరవిస్తానని అయితే అంతకుమించి ఆయన గురించి చెప్పదలుచుకోలేదని తెలిపారు.
కాగా, దీపక్ వ్యాఖ్యలు కలకలం రేకెత్తిస్తున్నాయి. సోదరి దీపా జయకుమార్‌కు ఆయన మద్దతివ్వడం సంచలనమని తమిళవర్గాలు చెప్తున్నాయి. జయలలిత మృతి తర్వాత ఆమె కోడలు దీపా జయకుమార్ తెరపైకి వచ్చి శశికళ పైన విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే దీపక్ మాత్రం పెద్దగా స్పందించకుండా పార్టీ అధినేత్రిగా శశికళకు మద్దతు ఇచ్చారు. కానీ తాజా ఇంటర్వ్యూలో పోయెస్ గార్డెన్ విషయంలో శశికళ తన కుటుంబ సభ్యులకు పార్టీని అప్పగించడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు శశికళను అంగీకరిస్తానని. అయితే పోయెస్ గార్డెన్ తన అక్కతో పాటు తనదేనని చెప్పడం అంతేకాకుండా శశికళ ఫ్యామిలీని అంగీకరించనని దీపక్ చెప్పడం గమనార్హం. మొత్తంగా ఇఫ్పుడు శశికళ వర్సెస్ జయలలిత ఫ్యామిలీగా మారిందని చెప్పవచ్చు. ఈ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అంటూ తమిళ తంబీలు భవిష్యత్ వైపు చూస్తున్నారు!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/