Begin typing your search above and press return to search.
చిన్నమ్మపై పిడుగేసిన అమ్మ మేనల్లుడు
By: Tupaki Desk | 9 April 2017 9:19 AM GMTఅమ్మ జయలలిత అంతిమ సంస్కార సమయంలో ఒక వ్యక్తి అందరి దృష్టిని ఆకర్షించారు. చిన్నమ్మ శశికళ పక్కనే ఉండి.. శవపేటికలో గంధం చెక్కలు.. మిగిలిన పూజాది ద్రవ్యాల్ని చిన్నమ్మతో కలిపి చేసిన బొద్దు కుర్రాడు గుర్తున్నాడా? ఇప్పుడా కుర్రాడి మాటలు చిన్నమ్మ శశికళకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తున్నాయి. అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ ఎన్నిక కోసం కోట్లాది రూపాల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నారు.
గెలుపే ధ్యేయంగా.. ఎంతకైనా సిద్ధమన్నట్లుగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వేళ.. ఎవరూ ఊహించని రీతిలో అమ్మ మేనల్లుడు దీపక్ జయకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నమ్మ పార్టీ తరఫున బరిలో దిగిన ఆమె బంధువు దినకరన్ పెద్ద మోసగాడిగా ఆయన అభివర్ణించారు. అమ్మకు శశికళ కేవలం స్నేహితురాలు మాత్రమేనని..రాజకీయ వారసురాలు ఎంతమాత్రం కాదని వ్యాఖ్యానించారు.
ఒక మీడియా సంస్థతో మాట్లాడిన దీపక్.. పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడిపే అధికారం శశికళ వర్గానికి లేని చెప్పటమే కాదు.. జయకు నిజమైన రాజకీయ వారసులు పన్నీరు సెల్వం.. మధుసూదనన్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుస్తానని అనుకుంటున్న దినకరన్ కలలు కల్లలు అవుతాయన్న దీపక్.. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అమ్మ ఫోటోతో ప్రచారం చేసే అర్హత దినకరన్ కు లేదన్నారు. ఉప ఎన్నికల్లో అమ్మ విశ్వాసపాత్రులే విజయం సాధిస్తారని వ్యాఖ్యానించారు. చిన్నమ్మ వర్గాన్ని దెబ్బ తీసేలా చేసిన దీపక్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. ఈ వ్యాఖ్యల్ని ఆర్కేనగర్ వాసులు ఎలా తీసుకుంటారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/