Begin typing your search above and press return to search.
కేసీఆర్ కలల పథకంపైనా దీపక్ రెడ్డి పడగ
By: Tupaki Desk | 10 Jun 2017 10:36 AM GMTహైదరాబాద్ లో తప్పుడు పత్రాలతో భారీ ఎత్తున భూములను కబ్జా చేసి లాభపడిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి టీఆరెస్ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ కలల పథకాన్నీ దెబ్బ కొట్టారట. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకం కోసం నిర్దేశించిన ప్రభుత్వ భూములను కూడా ఫోర్జరీ పత్రాలతో దీపక్ రెడ్డి తనవిగా చేసుకున్నారని.. వాటిని ప్లాట్లుగా మార్చి విక్రయించారని ఆరోపణలు వస్తున్నాయి.
హైదరాబాద్ లోని మెహిదీపట్నం సమీపంలో గుడిమల్కాపూర్ వద్ద ఉన్న 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన తన న్యాయవాది - మరికొందరి సహాయంతో తప్పుడు పత్రాలు సృష్టించి కాజేశారు. వాస్తవానికి ఈ భూములను తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి గుర్తించింది. కానీ.. అధికారుల అలసత్వం కారణంగా దీపక్ రెడ్డి వీటిని కాజేయగలిగారని తెలుస్తోంది. భూ కబ్జాల్లో ఆరితేరిపోయిన దీపక్ రెడ్డి ఈ భూములకు సంబంధించి ఫోర్జరీ పత్రాలు సృష్టించి దానిపై వివాదం కూడా సృష్టించారని... అందులో కొంత స్థలాన్ని ఇప్పటికే ప్లాట్లుగా మార్చి అమ్మేశారని తెలుస్తోంది.
కాగా దీపక్ రెడ్డి ముఠాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే.. వీరు అత్యంత పకడ్బందీగా ఫోర్జరీ పత్రాలను సృష్టిస్తుండడం... దానిపై లిటిగేషన్ ఏర్పరుస్తుండడంతో వారు కబ్జా చేసిన స్థలాలు సొంత యజమానులకు, సర్కారీ స్థలాలైతే ప్రభుత్వానికి మళ్లీ దఖలు పడడానికి కూడా సమయం పడుతుందని.. కోర్టుల్లో ఇవి తేలడానికి సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం కోసం గుర్తించిన 45 ఎకరాలు కూడా దీపక్ రెడ్డి చేతికి చిక్కడంతో దానిపై కేసులు తేలడం ఆలస్యమైతే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/