Begin typing your search above and press return to search.

పంజాబ్​ తో ఓటమి..భావోద్వేగానికి గురైన వార్నర్​..అస్సలు ఊహించలేదు..

By:  Tupaki Desk   |   25 Oct 2020 11:10 AM GMT
పంజాబ్​ తో ఓటమి..భావోద్వేగానికి గురైన వార్నర్​..అస్సలు ఊహించలేదు..
X
కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో శనివారం జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ 12 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్​లో హైదరాబాద్​ బౌలర్లు మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. బ్యాట్స్​మెన్స్​ తడబడ్డారు. ఆరంభంలో టీం కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ బాగా ఆడాడు. ఫోర్లు, సిక్సులు కొడుతూ స్కోర్​ బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ వార్నర్​ అవుట్​ కావడంతో టీం కష్టాల్లో పడింది. ఓ దశలో మనీశ్​ పాండే కూడా బాగానే పరుగులు రాబట్టాడు. హైదరాబాద్​ గెలుస్తుంది అనుకున్నారంతా.. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. చివరకు 12 పరుగులతో మ్యాచ్​ను ఓడిపోయారు. ప్లే ఆఫ్స్ సంక్లిష్టం చేసుకున్నారు.

కాగా మ్యాచ్​ ఓడిపోయిన అనంతరం వార్నర్​ మాట్లాడుతూ.. ‘ఓడిపోవడం చాలా బాధగా అనిపిస్తున్నది. మా బౌలర్లు బాగా రాణించారు. కానీ మిడిలార్డర్​ కొంతమెర పట్టుకోల్పోయింది. పంజాబ్​ బౌలర్ల స్పిన్​ మాయాజాలం బాగా పనిచేసింది. పంజాబ్​ బౌలర్లు కొత్త బంతితో రెచ్చిపోయారు. ఏది ఏమైనా ముందుగు సాగాల్సిందే’ అంటూ వార్నర్​ పేర్కొన్నాడు. ఇప్పటివరకు హైదరాబాద్​ 11 మ్యాచ్​లు ఆడింది .. 4 విజయాలు నమోదు చేసుకున్నది. 8 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. పంజాబ్​తో గత రాత్రి గెలవాల్సిన మ్యాచ్​ చిన్నచిన్న పొరపాట్లతో ఓటమి పాలైంది. 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. అయితే ఇప్పుడిక హైదరాబాద్​ జట్టుకు ప్లే ఆఫ్​ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.