Begin typing your search above and press return to search.
పారికర్ మరీ స్లో అయిపోయారే..?
By: Tupaki Desk | 14 April 2015 10:30 AM GMT గోవా ముఖ్యమంత్రిగా ఫేమస్ కావటమే కాదు.. ఆయనంత సమర్థుడు మరొకరు దొరకరంటూ రక్షణశాఖ మంత్రిగా మనోహర్ పారికర్‌ను పిలిచి మరీ బాధ్యతలు అప్పగించటం తెలిసిందే. సింఫుల్‌గా ఉండటం.. నిజాయితీగా వ్యవహరించటం ఆయన బలాలుగా చెబుతారు. అందరిని కలుపుకుపోవటంతో పాటు.. అనవసరంగా వివాదాస్పదం కాకపోవటం ఆయనలో ఉన్న మరోలక్షణం.
వీటన్నింటికి మించి సోషల్ నెట్‌వర్క్స్‌లో యమ యాక్టివ్‌గా ఉండే ఆయన ఈ మధ్య బాగా స్లో అయ్యారన్న మాట వినిపిస్తోంది. ప్రతి విషయం మీదా స్పందిస్తూ.. నిత్యం ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ చేసే ఆయన.. ఈ మధ్య కాలంలో చాలా స్లో అయ్యారు.
గడిచిన నెల రోజుల్లో పోలిస్తే.. ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక్క ట్వీట్ కూడా పోస్ట్ చేయకపోవటం గమనార్హం. సోషల్‌నెట్‌వర్స్క్‌లో యాక్టివ్‌గా ఉండాలని మోడీ కోరుతుంటే.. నిత్యం ట్విట్టర్ పోస్ట్‌లతో టచ్‌లో ఉండే ఆయన రక్షణమంత్రి అయిన తర్వాత నుంచి ట్విట్టర్‌లో స్లో అయ్యారని.. గత నెల రోజులుగా ఒక్క ట్వీట్ చేయకుండా ఉండిపోయారంటున్నారు. పని ఒత్తిడితోనే ఈ పరిస్థితి అని చెబుతున్నారు. ట్వీట్స్ చేసే వారంతా సొంతంగా ట్వీట్స్ చేస్తున్నారా ఏంటి..?