Begin typing your search above and press return to search.

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం

By:  Tupaki Desk   |   18 Sept 2021 8:00 AM IST
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం
X
టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి ఓ అరుదైన గౌరవం దక్కింది. ధోనికి భారత మిలటరీ లోని గౌరవ లెఫ్ట్ నెంట్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. 2011 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో గౌరవ ర్యాంకు పొందిన ధోని.. పారాచూట్ రెజిమెంట్ లో లెఫ్ట్ నెంట్ కల్నల్ గా బాధ్యతలు తీసుకున్నారు.

అయితే తాజాగా ఎంఎస్ ధోనికి మరో అరుదైన గౌరవాన్ని మన భారత మిలటరీ ఇచ్చింది. నేషనల్ క్యాడెట్ క్రాప్స్ (ఎస్.సీసీ) రివ్యూ చేసే 15 మంది డిఫెన్స్ మినిస్టర్ కమిటీలో ఎంఎస్ ధోనికి చోటు దక్కింది.

ఎన్.సీసీ సమగ్ర సమీక్ష నిర్వహించేందుకు, జాతీయ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేసింది మిలటరీ.. ఇందులో ధోనికి చోటు కల్పించడం విశేషం. దీనిపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ కీలక కమిటీలో ఎంఎస్ ధోనితోపాటు ప్రముఖ వ్యాపారవేత్త , మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కేంద్రమాజీ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు. ఎన్.సీసీలో మార్పులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.