Begin typing your search above and press return to search.

చైనాకు అంగుళం కూడా వదలలేదు.. రక్షణశాఖ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   13 Feb 2021 7:30 AM GMT
చైనాకు అంగుళం కూడా వదలలేదు.. రక్షణశాఖ క్లారిటీ..!
X
లడఖ్​లోని కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నదని ఇటీవల రాహుల్​గాంధీ పార్లమెంట్​లో ఆరోపించారు.

ఈశాన్య లడఖ్ లోని పాంగాంగ్ ఏరియాలో ఫింగ‌ర్ 4 వరకే భారత్​ ఆధీనంలో ఉందని ఆయన పేర్కొన్నారు. నిజానికి అక్కడ ఫింగర్​ 8 వరకు భారత్​ భూభాగంలో ఉండాల్సిందని.. కానీ కేంద్రం ఉదాసీన వైఖరి వల్లే ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకున్నదని ఆయన విమర్శించారు.
దీంతో ఈ విషయంపై రక్షణశాఖ స్పందించింది. రాహుల్​ గాంధీ చేస్తున్నదంతా అసత్య ప్రచారం అని రక్షణశాఖ పేర్కొన్నది.

ఈశాన్య లడఖ్ లోని పాంగాంగ్ ఏరియాలో భార‌త భూభాగం ఫింగ‌ర్ 4 వ‌ర‌కేనంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా తప్పు అని ర‌క్ష‌ణ‌శాఖ పేర్కొన్నది. ఫింగర్​ 8 వరకు భారత భూభాగమేనని తెలిపింది.
భార‌త‌దేశ చిత్ర‌ప‌టం ప్రకారం దేశంలో ఇప్ప‌టికే 43 వేల చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల భూభాగం 1962 నుంచి అక్ర‌మంగా చైనా ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న‌ద‌ని తెలిపింది. వాస్త‌వాధీన రేఖ కూడా భార‌తదేశ‌పు అవగాహ‌న ప్ర‌కారం ఫింగ‌ర్ 8 మీదుగా ఉందని..ఫింగ‌ర్ 4 మీదుగా కాద‌ని ర‌క్ష‌ణ‌శాఖ స్ప‌ష్టంచేసింది.

ఇప్పుడు ఫింగర్​ 8 వరకు భారత సైనికులు గస్తీ, పెట్రోలింగ్​ నిర్వహిస్తున్నారని పేర్కొన్నది.
భారత్​ చైనా మధ్య కొంతకాలంగా వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చైనా సైనికులు లడఖ్​ సరిహద్దుల వద్ద భారత భూభాగంలోకి చొరబడుతున్నారు.

ఈ నేపథ్యంలో భారత సైనికులు వెనక్కి తగ్గారని.. కొంత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నదన్న వార్తలు వచ్చాయి. లడఖ్​లోని ఫింగర్​ 4 భారత భూభాగంలో ఉన్నదని.. దీన్ని ఎందుకు చైనాకు వదిలిపెట్టారని ఇటీవల రాహుల్​ గాంధీ పార్లమెంట్లో ప్రశ్నించారు. దీంతో కేంద్ర రక్షణశాఖ స్పందించింది.