Begin typing your search above and press return to search.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌పై రక్షణ మంత్రి హాట్ కామెంట్స్ వైరల్!
By: Tupaki Desk | 27 Oct 2022 3:30 PM GMTజమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఓకే ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు, అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దాని పర్యవసనాలు పాకిస్థాన్ ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని రాజ్‌నాథ్ సూత్రప్రాయంగా తెలిపారు.
పాకిస్థాన్‌లోని గిల్గిత్, బాల్టిస్తాన్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటేనే.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాకారమైనట్టువుతుందన్నారు. 1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని శ్రీనగర్‌లో నిర్వహించిన శౌర్య దివాస్ కార్యక్రమంలో భాగంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఆ దేశం చేసే అరాచకాలకు తగిన ప్రతిఫలం అనుభవిస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి మతం అనేది లేదని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్‌పై గురిపెట్టడమే ఉగ్రవాదుల లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఆర్టికల్ 370ని తొలగించడంతో జమ్ముకశ్మీర్‌లో ప్రజలపై వివక్ష తొలగిపోయిందని రాజ్‌నాథ్ చెప్పారు. ప్రధాని మోదీ హయాంలోనే ఇది సాధ్యమైందని గుర్తు చేశారు.
కాగా ఈ పర్యటనలో భాగంగా భారత సైన్యం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పాలుపంచుకున్నారు.
కాగా భారత్ భూభాగంపై జరిగిన తొలిదాడిని 1947 అక్టోబర్ 27 భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లోని 1వ బెటాలియన్ అద్భుతమైన ధైర్యసాహసాలను ప్రదర్శించింది. దీనిని పురస్కరించుకొని ఆర్మీ ‘ఇన్‌ఫాంట్రీ డే’ను ఏటా నిర్వహిస్తోంది. మరోవైపు ఆ యుద్ధంలో వాయుసేన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది కూడా అక్టోబర్27నే. ఈ నేపథ్యంలో సైన్యం, వాయుసేన కలిసి శౌర్యదివస్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.