Begin typing your search above and press return to search.

ట్రంప్ రోమాన్స్ ఖర్చు : 2.80లక్షల డాలర్లు

By:  Tupaki Desk   |   23 Aug 2018 5:37 AM GMT
ట్రంప్ రోమాన్స్ ఖర్చు : 2.80లక్షల డాలర్లు
X
డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు కాకముందు బడా పారిశ్రామికవేత్త.. మంచి శృంగార ప్రియుడు.. చాలా మంది అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.. అందులో కొందరు మహిళలు ట్రంప్ అధ్యక్షుడయ్యాక బహిరంగంగా వ్యాఖ్యానించారు కూడా. అవి ట్రంప్ ను చిక్కుల్లో పడేశాయి.

అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వక ముందు ఆయనతో గడిపిన వారు నోరు తెరవకుండా ఉండేందుకు వారికి భారీగా డబ్బు ఆఫర్ చేశాడట. తన సహాయకులు - లాయర్ల ద్వారా మహిళలు బయటకు చెప్పకుండా సెటిల్ మెంట్లు చేశాడట. ఇప్పుడవి బయటకు వస్తున్నాయి.. ట్రంప్ సహాయకులు ఇద్దరు వేర్వేరు కేసుల్లో దోషులుగా తేలడంతో ట్రంప్ రాసలీలల చేష్టలన్నీ బయటపెట్టారు. ఇవి అమెరికా అధ్యక్షుడి పీఠానికే ఎసరు తెస్తున్నాయి.

తాజాగా 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు ట్రంప్ తో సంబంధాలపై నోరెత్తకుండా ఉండేందుకు శృంగార తార స్టార్మీ డేనియల్స్ కు ట్రంప్ భారీగా డబ్బు చెల్లించాడని ట్రంప్ మాజీ న్యాయవాది మైకేల్ కోహెన్ మంగళవారం కోర్టులో అంగీకరించాడు. ఇక చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన ట్రంప్ మాజీ ప్రధాన ప్రచారకర్త పాల్ మనాఫోర్డ్ కూడా ట్రంప్ ఇద్దరు మహిళల తో సంబంధం పెట్టుకొని వారు నోరు తెరవకుండా డబ్బులు ముట్టజెప్పామని కోర్టులో ఒప్పుకున్నారు. పన్ను ఎగవేత - బ్యాంకుల మోసం - ప్రచారంలో అవకతవకలకు పాల్పడ్డ కేసులో మనాఫోర్డ్ దోషిగా తేలాడు. పనిలో పనిగా తాను మునగడమే కాకుండా ట్రంప్ ను ముంచేసి అమెరికా వ్యాప్తంగా సంచలననానికి తెరతీశాడు. ఈ ఇద్దరు మహిళలకు ట్రంప్ 2.80 లక్షల డాలర్లు ఇచ్చి వారి నోరు మూయించినట్లు వారు కోర్టుకు తెలిపారు. ఈ లీక్ తో ట్రంప్ కు చిక్కులు వచ్చిపడ్డాయి. అతడిని అమెరికా అధ్యక్షుడిగా తీసేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.