Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ : నిబంధనల్ని తుంగలో తొక్కిన ఎమ్మెల్యే ...కేసు నమోదు !
By: Tupaki Desk | 6 April 2020 9:50 AM GMTకరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ లాక్ డౌన్ సమయంలో కేవలం..నిత్యావసర సరుకుల దుకాణాలు - హాస్పిటల్ - మెడికల్ స్టోర్స్ కి తప్ప వేరే ఏ ఇతర దుకాణాలకు కూడా తెరిచి ఉంచడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ నిత్యావసర సరుకులు తీసుకోవడానికైనా కూడా సామాజిక దూరం పాటించాల్సిందే. అయిన కూడా కొంతమంది అధికారం చేతిలో ఉంది కదా అని - లాక్ డౌన్ సమయంలో కూడా ఇష్టం వచినట్టు ప్రవర్తిస్తూ తుంగలో తొక్కుతూ... ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
తాజాగా ఇలాంటి ఒక సంఘటన మహారాష్ట్ర లో చోటు చేసుకుంది. బీజేపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు ఉచిత రేషన్ పంచాడు. లాక్ డౌన్ సమయంలో ఉచితంగా రేషన్ పంచితే మంచిదే కదా అని అనుకుంటున్నారా? చేసేది మంచి పనే అయినప్పటికీ ..కరోనా విజృంభిస్తున్న సమయంలో ..బర్త్ డే అంటూ .వందలాది మంది గుమికూడడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. దేశంలోనే కరోనా కేసులలో ఎక్కువ శాతం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. వార్దా జిల్లా అర్వి నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే దాదారావు పుట్టిన రోజు 2020 - ఏప్రిల్ 05వ తేదీ ఆదివారం. ఈయన ప్రతి పుట్టిన రోజు సందర్భంగా పేదలకు బియ్యం - గోధుమలు - ఇతరత్రా సరుకులు అందచేస్తుంటారు. ఈసారి కూడా అలాగే చేద్దామని డిసైడ్ అయ్యారు. వందలాది మంది గుమికూడడం అందర్నీ ఆందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు - అధికారులు అక్కడకు చేరుకొని - అందరిని తరిమికొట్టారు.
అలాగే ఆ ఎమ్మెల్యే అధికారుల నుండి ఈ కార్యక్రమానికి సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోలేదని, అతని మీద అంటువ్యాధుల చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ,ఆ ఎమ్మెల్యే మాత్రం .. రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. తన బర్త్ డే సందర్భంగా కొంతమందికి మాత్రమే నిత్యావసరుకులు మాత్రమే అందచేస్తానని, విపక్షాలే ఇంతమందిని రప్పించారని ఆయన ఆరోపిస్తున్నారు.