Begin typing your search above and press return to search.
రైల్వేల ఈ లెక్కలన్ని దేని లెక్క..?
By: Tupaki Desk | 9 Jan 2016 4:34 AM GMTఓరి నీ యేషాలో అన్నట్లుగా ఉంది రైల్వే శాఖ లెక్కల మాటలు చూస్తుంటే. మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక పెంచినట్లు అనిపించకుండానే ఒకదాని తర్వాత ఒకటిగా పెంపు కొరడా దెబ్బలు కొడుతూ..రైల్వే శాఖకు చెందిన ప్రతి సేవకు ధరలు పెంచటం తెలిసిందే. గత ప్రభుత్వాలకు భిన్నంగా బడ్జెట్ తో సంబంధం లేకుండా తనకు తోచిన ప్రతిసారీ కొన్ని సేవలకు ఓ రేంజ్ లో బాదేస్తున్న రైల్వే శాఖ.. తాజాగా సరికొత్త ప్రచారాన్ని మొదలెట్టింది. ఈ ప్రచారం మొత్తం తమలాంటి సేవాగుణం ఉన్న శాఖ మరొకటి లేదన్నట్లుగా గొప్పలు చెప్పుకోవటం గమనార్హం. దేశ ప్రజలకు తమ మాదిరి ఎవరూ సాయం చేయలేదన్న రీతిలో లెక్కలు చెబుతూ.. కారుచౌకగా సేవలు అందిస్తున్నామని కొంగొత్తగా చెప్పుకొచ్చింది.
రైళ్లల్లో ప్రయాణం చేయటం ఎంత చౌక అన్నట్లుగా ఈ ప్రచారం ఉండటం విశేషం. ఇందులో భాగంగా రైల్వే టిక్కెట్ ఛార్జీలు చాలా చౌకన్నట్లుగా చెప్పేందుకు వీలుగా పలు రకాల ఉదాహరణల్ని తెర పైకి తీసుకొచ్చింది. కిలో యాపిల్ పండ్ల కంటే కూడా.. దేశ రాజధాని ఢిల్లీ కంటే అగ్రా నగరానికి అయ్యే ప్రయాణ ఖర్చు తక్కువ తెలుసా అంటూ లెక్క చెప్పింది. ఢిల్లీ.. అగ్రా మధ్య సాధారణ క్లాస్ ప్రయాణానికి రూ.85 అవుతుందని.. కేజీ యాపిల్ పండ్లు అంత కంటే తక్కువ తెలుసా అని చెబుతోంది. కాకుంటే.. కిలో యాపిల్ పండ్లు రూ.85లకు ఎక్కడ దొరుకుతున్నాయో రైల్వే శాఖే చెప్పాలి.
ఇలాంటి కాకి లెక్కే మరొకటి చెప్పుకొచ్చింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ కు సాధారణ తరగతిలో ప్రయాణిస్తే 105 అవుతుందని.. ఇది కిలో శుద్ధి చేసిన వంట నూనె ధర కంటే తక్కువగా పేర్కొంది. కానీ.. మార్కెట్లో చూస్తే.. డబుల్ రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు ప్యాకెట్ రూ.80కి మించి లేదు. మరి.. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ టిక్కెట్టు రూ.105 చూపించి.. ఇది లీటరు శుద్ధి చేసిన వంట నూనె కంటే తక్కువని చెప్పుకొచ్చింది. ఈ తరహా చిత్రమైన లెక్కల్ని మరికొన్నింటిని చెప్పుకొచ్చింది.
తామెంత చౌకగా సేవల్ని అందిస్తున్నామో అన్నట్లుగా చెప్పుకుంటున్న రైల్వేశాఖ ప్రచారం లెక్క చూస్తుంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లు లేదు? వార్షిక రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టటానికి మూడు నెలల ముందు.. వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రచారంలా అనిపించట్లేదు. రైల్వేలు నష్టాల్లో నడుస్తున్నాయని.. ధరల పెంపుతో నష్టాల్ని భర్తీ చేయాలని భావించినా.. ప్రజాగ్రహం వస్తుందన్న భయంతో ఉన్న మోడీ సర్కారు.. తాజా ప్రచారం ద్వారా ధరల పెంపు తప్పేం కాదన్నట్లుగా తాజా ప్రచారం సాగుతున్నట్లు కనిపించక మానదు.