Begin typing your search above and press return to search.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో భార్యభర్తల బ్యాగుల్ని తనిఖీ చేస్తే.. షాకింగ్ ఉదంతం
By: Tupaki Desk | 14 July 2022 4:23 AM GMTకలలో కూడా ఊహించని సీన్ ఒకటి చోటు చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఒక జంట లగేజ్ ను పరీక్షించిన వేళలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. రెండు ట్రాలీ బ్యాగుల్లో వెళుతున్న ఈ జంట లగేజ్ మీద అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో స్పందించిన వారు.. వెంటనే వారి లగేజ్ ను చెక్ చేశారు.
ఈ సందర్భంగా వారి ముఖంలో కనిపించిన ఆందోళన నేపథ్యంలో వారి లగేజ్ ను మరింత జాగ్రత్తగా పరిశీలించారు. వారి లగేజ్ లో అనుమతి లేకుండా దిగుమతి చేసుకున్న పిస్టల్స్ పెద్ద ఎత్తున ఉన్న వైనం వారిని విస్మయానికి గురి చేసింది. రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 పిస్టల్స్ ను తీసుకొని వెళుతున్న వైనంతో వారిద్దరిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఇవి నిజమైన పిస్టల్స్? లేదంటే.. బొమ్మవా అన్నది తేల్చాల్సి ఉంది.
అయితే.. ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చిన ట్రాలీ బ్యాగుల్లో 45 పిస్టల్స్ ను తీసుకురావటం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఉదంతంపై విచారణకు ఉగ్రవాద నిరోధక విభాగమైన నేషనల్ సెక్యూరిటీ గార్డు రంగంలోకి దిగింది. ఈ కేసును చేధించే బాధ్యతను తీసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమంటే.. ఈ జంట ట్రాలీ బ్యాగుల్లో ఉన్న పిస్టల్స్ అన్నీ అసలైనవేనని తేల్చినట్లుగా చెబుతున్నారు. తమ లగేజ్ తో భారీగా ఆయుధాల్ని తీసుకెళుతున్న ఈ జంటను జగ్జిత్ సింగ్.. జశ్విందర్ కౌర్ గా గుర్తించారు.
ఈ నెల 10న వియత్నాం నుంచి వారు భారత్ కు వచ్చినట్లుగా తేలింది. వీరి వద్ద ఉన్న పిస్టల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? వాటిని ఎలా తీసుకొచ్చారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ఈ జంట భారత్ లో సెటిల్ అయ్యేందుకు వియత్నాం నుంచి వచ్చారని చెబుతున్నారు. నిబంధనలకు భిన్నంగా తీసుకెళుతున్న సూట్ కేసుల్లో ఇంత భారీగా ఆయుధాలు ఉండటం అధికారుల్ని సైతం షాక్ కు గురి చేస్తోంది. ఈ జంట నిజంగానే భార్యా భర్తలేనా?అన్నది మరోసారి తనిఖీ చేస్తున్నారు.
ఒక అంచనా ప్రకారం వారు తీసుకెళుతున్న పిస్టల్స్ విలువ రూ.22.5 లక్షలుగా చెబుతున్నారు. చూసినంతనే క్యూట్ గా ఉన్న ఈ జంట కామ్ గా ఇంత భారీ ఎత్తున ఆయుధాల్ని తమ వెంట తీసుకెళ్లటంపై విచారిస్తున్నారు. తమతో ఇంత భారీగా ఆయుధాల్ని ఎందుకు తీసుకెళుతున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఏదో ఒక బలమైన కారణంతోనే వారు ఇదంతా చేసి ఉంటారని భావిస్తున్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఈ పిస్టల్స్ ను టర్కీ నుంచి తీసుకొచ్చినట్లుగా అంచనా వేస్తున్నారు.
ఫ్రాన్స్ లోని పారిస్ నుంచి బయలుదేరిన నిందితులు వియత్నాం మీదుగా భారత్ కు వచ్చారు. వీరు వియత్నాంలో దిగినప్పుడు జగజిత్ సింగ్ సోదరుడు మన్ జిత్ సింగ్ ఆయుధాలు ఉన్న బ్యాగును అందజేసినట్లుగా భావిస్తున్నారు. ఈ జంటను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది మరిన్ని ప్రశ్నల్ని వారికి సంధిస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో ఉండే ఎయిర్ పోర్టుకు ఏ గుండె ధైర్యంతో ఇంత భారీగా పిస్టల్స్ ను తమతో పాటు తీసుకొచ్చారన్నది హాట్ టాపిక్ గా మారింది.