Begin typing your search above and press return to search.
ఢిల్లీ - మహారాష్ట్ర బాటలో మే 3 తర్వాత లాక్ డౌన్?
By: Tupaki Desk | 26 April 2020 11:57 AM GMTలాక్ డౌన్ మే 3తో దేశంలో ముగుస్తుందా? లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. లాక్డౌన్ దేశంలో అమలవుతున్నా కేసుల సంఖ్య మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సామాజిక దూరం - లాక్ డౌన్ తోనే కరోనాను కట్టడి చేయగలమని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో లాక్ డౌన్ మే 7న ముగియనుంది. కేసుల సంఖ్య పెరిగితే జూన్ వరకు పొడిగించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగిస్తామని సంకేతాలిచ్చాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం లాక్ డౌన్ ఎత్తివేస్తే కేసులు పెరుగుతాయని ఆందోళన చెందుతున్నారట.. కేంద్రం పలు దుకాణాలను తెరుచుకునేందుకు మినహాయింపు ఇవ్వడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తాజాగా తప్పుపట్టారు. కరోనా పెరుగుతుందని హెచ్చరించారు.
ఇక దేశంలోనే అత్యధిక కేసులు - మరణాలు సంభవిస్తున్న మహారాష్ట్రలోనూ లాక్ డౌన్ ను ఎత్తివేయడం కష్టమని అధికారులు తెలిపారు. అక్కడ జూన్ వరకు పొడిగించాలని ప్రభుత్వం చూస్తోంది. లాక్డౌన్ ఎత్తివేస్తే కేసులు మరింత పెరగడం ఖాయమంటున్నారు.
ఇక ఢిల్లీ, మహారాష్ట్ర బాటలోనే గుజరాత్ - రాజస్థాన్ - తమిళనాడుతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ పొడిగింపునకే ఆసక్తి చూపుతున్నాయి. అయితే కేంద్రం నిర్ణయం వెలువరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చూస్తున్నాయి.
దీన్ని బట్టి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరింత కాలం పొడిగించే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లకా్ డౌన్ పొడిగించడం ఖాయంగా కనిపిస్తోంది.