Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు ఏపీ ఫలితాలను గుర్తు చేసిన ఢిల్లీ

By:  Tupaki Desk   |   11 Feb 2020 12:15 PM GMT
కాంగ్రెస్ కు ఏపీ ఫలితాలను గుర్తు చేసిన ఢిల్లీ
X
శతాబ్దంన్నర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కాలం కలిసి రావడం లేదు. ఏ ఎన్నికలైనా ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోగా నామమాత్రపు ఫలితాలు కూడా రావడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ చావు దెబ్బ తింటోంది. 2014 నుంచి కాంగ్రెస్ కు పరాజయాల పరంపర కొనసాగుతోనే ఉంది. 2014లో మోదీ హవా ముందు కాంగ్రెస్ దారుణ ఫలితాలు పొందింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అవే ఫలితాలు పునరావృతమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు అదే ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఘోరమైన ఫలితాలు పొందింది. అంతకుముందు అధికారంలో ఉండి ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కని దుస్థితి ఏర్పడింది. ఇఫ్పుడు ఈ ఫలితాలు ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చాయి.

అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో భారీ మూల్యం చెల్లించుకుంది. రాష్ట్రాన్ని విభజించిన పార్టీగా గుర్తించి కాంగ్రెస్ ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. మొత్తం 175 స్థానాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మొదటి నుంచి కాంగ్రెస్ అసలు పోటీనే కనబర్చలేదు. ఒక్క స్థానంలో కూడా ఆధిక్యంలో లేదు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది.

గతంలో 15 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత 2013లో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత 2015లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా దారుణ ఫలితం పొందింది. 70 స్థానాల్లో ఒక్క స్థానం కూడా పొందకపోగా మళ్లీ ఇప్పుడు 2020లో కూడా కాంగ్రెస్ కు అదే పరిస్థితే ఏర్పడింది.