Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ పై మోదీ నిర్ణయమేంటో ముందే బయటపెట్టిన ఢిల్లీ సీఎం !
By: Tupaki Desk | 11 April 2020 2:39 PM GMTకరోనా మహమ్మారి దేశాన్ని స్తంభింపజేసింది. కరోనాకి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో మరో మార్గం లేక ..లాక్ డౌన్ ను విధించారు. కరోనాను అడ్డుకోవాలంటే ఇదొక్కటే మార్గం అంటూ ప్రతి పౌరుడూ బతికి బట్టకట్టాలంటే లాక్ డౌన్ తో పాటు సామాజిక దూరాన్ని కూడా కచ్చితంగా పాటించాలని నేను విజ్ఞప్తి చేశా. దేశంలోని ప్రజలు నా విజ్ఞప్తిని అర్థం చేసుకొని తమ తమ ఇళ్లలోనే ఉంటూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు అని మోదీ మొదటి సారిగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంలో చెప్పారు. తోలి దర్సాలో 21 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు.
అయితే , ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు స్వాగతిస్తూ ..ప్రతి రాష్ట్రం కూడా లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేసాయి. తొలిదశ లాక్ డౌన్ గడువు ..ఏప్రిల్ 14 తో ముగియబోతుంది. కానీ , దేశంలో కరోనా కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ ను మరికొన్ని రోజులు పొడగించాలని పలు ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎలా ఉంది ..ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని - శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ అనంతర పరిణామాలు లాక్ డౌన్ మరో రెండు వారాలు కొనసాగనుందనే సంకేతాలనిస్తున్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన తాజా ట్వీట్ లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రధాని మోదీ లాక్ డౌన్ ను పొడిగిస్తూ సరైన నిర్ణయం తీసుకున్నారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. కరోనా వల్ల అతలాకుతలమైన అనేక దేశాలతో పోలిస్తే భారత్ లో పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. దీనికి కారణం వెంటనే లాక్ డౌన్ ను అమలు చేయడం అని , కానీ , ఇప్పుడు ఉన్నపలంగా ఒకేసారి లాక్ డౌన్ ను ఎత్తేస్తే .. ఇప్పటిదాకా చేసిందంతా వృధా అవుతుందని ఢిల్లీ సీఎం తెలిపారు. మొత్తంగా మోదీ తీసుకోబోయే నిర్ణయం ఏంటో ఢిల్లీ సీఎం క్రేజీవాల్ ముందే చెప్పేసారు ?