Begin typing your search above and press return to search.
మ్యానర్ లెస్ సీఎం... ట్రోలింగే ట్రోలింగ్...
By: Tupaki Desk | 28 April 2022 2:30 AM GMTఆయనకు పొలిటికల్ గా క్రేజ్ బాగానే ఉంది. ఈ మధ్య ఉత్తరాదిన ఒక పెద్ద రాష్ట్రాన్ని గెలుచుకుని మరీ గ్రేట్ అనిపించుకున్నారు. ఆయనే ఢిల్లీ కా బాదుషా అరవింద్ కేజ్రీవాల్. ఆయన మోడీ అంటే గట్టిగానే వ్యతిరేకిస్తారు. అయితే అది ఫక్తు రాజకీయం. మామూలుగా చూసుకుంటే మోడీ దేశానికి ప్రధాని, ఈయన ఢిల్లీకి సీఎం.
ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని ఎవరైనా గౌరవించాల్సిందే. అయితే తాజాగా మోడీ దేశంలోని ముఖ్యమంత్రులు అందరితో వర్చువల్ విధానంలో మీటింగ్ పెడితే ఆ వీడియో భేటీలో ఢిల్లీ సీఎం పోకడలు మాత్రం చిత్రంగా ఉన్నాయని నెటిజన్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.
ప్రధాని మోడీ ఈ మీటింగులో అనేక కీలకమైన విషయాలు చెబుతూంటే కేజ్రీవాల్ చేతులు తలపై పెట్టుకుని కాసేపు, గోక్కుంటూ మరి కాసేపూ నిర్లక్ష్యంగా కూర్చున్నారు అని కామెంట్స్ అయితే వచ్చి పడుతున్నాయి. ఎంత గొప్ప వారు అయినా అరవింద్ సారూ పీఎం ఎదురుగా మాట్లాడుతూంటే కనీసం ప్రోటోకాల్ పాటించరా అంటూ నెటిజన్లు ఒక్క లెక్కన ట్రోల్ చేసి పారేస్తున్నారు.
ప్రధాని కరోనా నియంత్రణ మీద మాట్లాడుతున్నారని, విలువైన సూచనలు ఇస్తున్నారని, అది జనాలకు సంబంధించిన విషయమని, ఢిల్లీలో చూస్తే కరోనా కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా నెటిజన్లు అంటున్నారు. అయినా ఒక సీఎం ప్రధాని ఎదుట అలా వ్యవహరించడం మాత్రం అసలు బాగోలేదు అనేస్తున్నారు. మరి ఇప్పటిదాకా పొలిటికల్ చరిష్మాతో దేశంలోని మేధావులను సగటు జనాలను ఆకట్టుకునే కేజ్రీవాల్ ఎందుకిలా చేశారు అని కూడా నిలదీస్తున్నారు.ఇక మానర్ లెస్ సీఎం అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ట్వీట్ల మీద ట్వీట్లు కేజ్రీవాల్ మీద పెడుతున్నారు. మరి దీని మీద ఢిల్లీ కా బాధుషా ఎలా రియాక్ట్ అవుతారో సుమా.