Begin typing your search above and press return to search.
కేసీఆర్‌కు షాక్.. ఖమ్మం సభలో తన బాధలు చెప్పుకొన్న ఢిల్లీ సీఎం!
By: Tupaki Desk | 18 Jan 2023 3:36 PM GMTఇది ఒకింత తెలంగాణ సీఎం, బీఆర్ ఎస్ అదినేతకు మింగుడు పడని విషయం. ఆయన బీఆర్ ఎస్ ఆవిర్భావ సభను ఖమ్మంలో దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టారు. దీనికిముగ్గురు సీఎంలను పిలిచారు. అదేసమయంలో యూపీ మాజీ సీఎం కూడా వచ్చారు. అయితే.. ఈ సభ లక్ష్యం.. తనను బలపరిచే వారిని తెరమీదికి తీసుకువచ్చి.. ప్రదాని మోడీకి తన బలాన్నినిరూపించాలనేది బీఆర్ ఎస్ అధినేత లక్ష్య. అయితే.. ఇతర సీఎంలు అంటే.. పంజాబ్, కేరళ ముఖ్యమంత్రుల మాట ఎలా ఉన్నా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై కేసీఆర్ ఆశలు పెట్టుకున్నారు.
ఎందుకంటే.. మోడీకి, కేజ్రీకీ.. ఇప్పుడు చాలా వైరం సాగుతోంది. దీంతో ఇక్కడ నుంచి తనకు మద్దతుగా మాట్లాడతారని..కేసీఆర్ భావించారు. కానీ, అనూహ్యంగా కేజ్రీవాల్.. కేసీఆర్‌కు మద్దతు విషయాన్ని పక్కన పెట్టి.. ఖమ్మం వేదికగా కూడా మెజారిటీ పార్ట్ అంతా తన బాధలు చెప్పుకొనేందుకు ప్రయత్నించారు. చెప్పారు కూడా! దీంతో సభపైనే కేసీఆర్ విస్మయం.. ఒకింత విచారం కూడా వ్యక్తం చేయడం.. స్పష్టం గా కనిపించింది.
ఇంతకీ.. కేజ్రీవాల్ ఏమన్నారంటే.. రాష్ట్రాల్లో గవర్నర్లను మోడీ ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ప్రారంభనోపన్యాసంలో మాత్రం తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించారు. ఇవాళ తాను రెండు గొప్ప కార్యక్రమాల్లో పాల్గొన్నానన్నారు. కంటి వెలుగు అద్భుత కార్యక్రమమన్న ఆయన.. కంటి వైద్య పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయమని కొనియాడారు. కంటి వెలుగు కార్యక్రమం ఢిల్లీలోనూ అమలు చేస్తామన్నారు.
తాము ఒకరి నుంచి మరొకరం నేర్చుకుంటామని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మొహల్లా క్లినిక్‌లను సీఎం కేసీఆర్ తెలంగాణలో బస్తీ దవాఖానాగా అమలు చేశారన్న ఢిల్లీ సీఎం... మొహల్లా క్లినిక్‌ల పరిశీలనకు కేసీఆర్ ఢిల్లీ గల్లీలో తిరిగారని గుర్తు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ పాఠశాలలు పరిశీలించి.. తమ రాష్ట్రం(తమిళనాడు) పాఠశాలలు బాగుచేసుకున్నారని కేజ్రీవాల్ వెల్లడించారు. మోడీ గవర్నర్లను ఆడిస్తున్నారని.. తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని.. తెలిపారు. గవర్నర్లకు ఢిల్లీ నుంచి ఒత్తిడి ఉందన్నారు. సీఎంలను ఇబ్బందులు పెట్టడంలో ప్రధాని బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.