Begin typing your search above and press return to search.
సచివాలయం నుంచే...సీఎం కారును ఎత్తుకెళ్లారు
By: Tupaki Desk | 12 Oct 2017 5:07 PM GMTకొన్ని నగరాల్లో...ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటి...కార్లు...బైకులు వంటివి ఎత్తుకెళ్లడం కామన్ అయిపోయింది అనుకోండి. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి కారు చోరీ అవడం అంటే నిజంగా ఆశ్చర్యకరమే కదా? అందులోనూ రాష్ట్ర పరిపాలనకు వేదిక అయిన సెక్రటేరియట్ నుంచి కారును దొంగలించడం అంటే...ఆశ్చర్యకరమే కాదు..విస్మయకరం కదా? అదే జరిగింది. దేశ రాజధాని ఢిల్లీ ఈ చిత్రమైన దోపిడికి వేదిక అయింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారు చోరీకి గురైంది. సీఎం కేజ్రీవాల్ ఉపయోగించే బ్లూ వాగనార్ కారు DL9 CG 9769 ఇవాళ సాయంత్రం సెక్రటేరియట్ కు సమీపంలో పార్కు చేసి ఉంచగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం అధికారిక వాహనాన్ని కేజ్రీవాల్ ఉపయోగిస్తున్నారు. ఈ వాహనం ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు ఉపయోగిస్తున్నారు. పార్టీకి చెందిన వారు సెక్రటేరియట్ కు వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.
కాగా, తనకు ప్రియమైన - అచ్చివచ్చిన కారు చోరీ అవడం పట్ల ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్నం ఈ చోరీ జరిగినట్లు భావిస్తున్నారు.