Begin typing your search above and press return to search.

ఢిల్లీ పోలీసులకు బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   7 March 2016 4:36 AM GMT
ఢిల్లీ పోలీసులకు బంపర్ ఆఫర్
X
తీవ్ర ఒత్తిడితో విధులు నిర్వహించే ఉద్యోగులు ఎవరైనా ఉన్నారంటే.. ఆ జబితాలో తొలి వరుసల్లో నిలుస్తారు పోలీసులు. అలాంటి పోలీసుల కోసం ప్రభుత్వాలు పెద్దగా చేస్తున్నది లేదు. గతంతో పోలిస్తే.. ఇప్పుడిప్పుడే పలు ప్రభుత్వాలు పోలీసుల సంక్షేమంపై దృష్టి సారిస్తోంది. దీనికి ఏపీ.. తెలంగాణలో పోలీసులకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలు చెప్పొచ్చు. ఇక.. వారికి సెలవుల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఢిల్లీ రాష్ట్ర సర్కారు ఒక ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. నిత్యం డ్యూటీలో ఉండే పోలీసులకు రిలీఫ్ కలిగించేలా ఉండే ఈ నిర్ణయం చూస్తే.. పోలీసులు తమ వివాహ వార్షికోత్సవం రోజు.. తమ పిల్లల పుట్టినరోజుల్లో సెలవు పెట్టేందుకు వీలు కల్పించారు.

అసాధారణ సందర్భాల్లో తప్పించి.. మామూలు రోజుల్లో అయితే.. మ్యారేజ్ డేకి.. పిల్లల బర్త్ డేకి సెలవు తీసుకునేందుకు వీలు కల్పిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం పోలీసులకు సంతోషాన్ని కల్పించటమే కాదు.. మరింత ఉత్సాహంగా పని చేయటానికి అవకాశం కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఢిల్లీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం తరహాలోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఈ దిశగా అడుగు వేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి.. ఈ విషయంపై చంద్రుళ్లు ఇద్దరు ఏం చేస్తారో..?