Begin typing your search above and press return to search.
ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు.. ఆప్ టికెట్ 80 లక్షలా?: బీజేపీ స్టింగ్ వీడియో సంచలనం
By: Tupaki Desk | 21 Nov 2022 4:30 PM GMTఢిల్లీ రాజకీయాల్లో నువ్వా-నేనా అన్నట్టుగా తలపడుతున్న బీజేపీ- ఢిల్లీ అధికార పార్టీ ఆమ్ ఆద్మీలు ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతున్నారు. రచ్చ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రంగం రెడీ అయింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేడిలోనే ఇవి కూడా జరుగుతున్నాయి. డిసెంబరు 5న కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నాలుచేస్తోంది.
అదేసమయంలో మరోసారి సత్తా నిరూపించుకునేందుకు అధికార ఆప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రెండు పార్టీల నేతలు కూడా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆప్ కార్పొరేటర్/ వార్డు టికెట్లను అమ్ముకుంటోందని బీజేపీ నేతలు కొన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. అయితే, నిరూపించండి! అని ఆప్ కూడా సవాల్ రువ్వింది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంచలన స్టింగ్ వీడియోను బీజేపీ నేతలు మీడియాకు విడుదల చేశారు.
ఆప్ వార్డు టికెట్‌ను రూ.80 లక్షలకు విక్రయిస్తున్నట్లు వీడియోలో ఉందని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర తెలిపారు. ఈ వీడియో అన్ని స్టింగ్స్‌కు తల్లిలాంటిదని వ్యాఖ్యానించారు. ``ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అవినీతిని బయటపెట్టాలంటూ పిలుపునిస్తుంటారు.. ఇప్పుడు ఆ పార్టీ నేత బిందు ద్వారా ఆప్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకుంటోంది`` అని పాత్ర నిప్పులు చెరిగారు. ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్, చట్ట సభ్యుడు సౌరభ్ భరద్వాజ్ పేర్లు కూడా ఈ వీడియోలో ఉండటంతో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ఆ వీడియోలో రోహిణి నుంచి పోటీ చేసేందుకు తాను అడిగినంత మొత్తం ఇస్తానని ఆప్ మాజీ సభ్యురాలు బిందు చెబుతోంది. రోహిణి అసెంబ్లీ నియోజకవర్గం ఆప్ ఇంచార్జ్ పునీత్ గోయల్ తో ఆమె చర్చలు జరుపుతున్నట్టు వీడియో కనిపిస్తోంది. ఎలా చెల్లింపు చేయాలని అడుగుతున్నారు. మరో వీడియోలో ఆప్ నార్త్ వెస్ట్ ఢిల్లీ లోక్‌సభ ఇంఛార్జ్ ఆర్ఆర్ పఠానియాతో చర్చించారని సంబిత్ పాత్ర తెలిపారు. 110 టికెట్లను ఆప్ భారీ మొత్తానికి అమ్మే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎంసీడీ టికెట్లే కాదు.. అసెంబ్లీ సీట్లను కూడా ఆప్ అమ్ముకుంటోందని మరో బీజేపీ నేత విజేంద్ర గుప్తా ఆరోపించారు.
పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వట్లేదు: బిందు
ఆప్ నాయకురాలు బిందు చేసిన వ్యాఖ్యలు బీజేపీకి మరింత దన్నుగా మారాయి. ధనవంతులకే ఆప్ టికెట్లను విక్రయిస్తోందని బిందు ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసినవారికి టికెట్ల ఇవ్వడం లేదని మండిపడ్డారు. అయితే, బీజేపీ ఆరోపణలపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ మరో జిమ్మిక్కు చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ మొదట లిక్కర్ స్కాం అన్నారు కానీ, దానిలో ఏదీ బయటపడలేదని అన్నారు. ఆ తర్వాత బస్ స్కాం, రోడ్ స్కాం, ఇప్పుడు టికెట్ స్కాం అంటున్నారని చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.