Begin typing your search above and press return to search.
నిర్భయ కేసులో మరో ట్విస్ట్ .. చివరి అవకాశం
By: Tupaki Desk | 5 Feb 2020 10:49 AM GMTనిర్భయ దోషులకు ఉరిశిక్ష జాప్యంపై కేంద్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు లో చుక్క ఎదురయ్యింది. పాటియాల ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసులో దోషులను వేర్వేరుగా ఉరి తీయాల్సిన అవసరం లేదని.. ఒకేసారి నలుగురు దోషుల్ని ఉరి తీయాలని తీర్పు ఇచ్చింది. అలాగే పాటు న్యాయపరమైన అవకాశాలకు వినియెగించుకునేందుకు దోషులకు వారం పాటు హైకోర్టు గడువు ఇచ్చింది. ఈ వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది.
నిర్భయ కేసులో నిందితులుగా ఉన్న ముకేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ చట్టంలో ఉన్న లొసుగులని ఉపయోగించుకొని శిక్ష అమలు కాకుండా అడ్డుకుంటున్నారు. ఈ కేసులో... నలుగురు దోషులకూ ఒకేసారి ఉరిశిక్ష వెయ్యాలనే రూల్ ఉంది. ఈ రూల్‌ని అడ్డం పెట్టుకొని నలుగురు ఒకేసారి కాకుండా... ఒకరి తర్వాత ఒకరుగా రాష్ట్రపతి కి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకుంటూ, శిక్షని అమలు ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు. దీని ఫలితంగా ఫలితంగా ఫిబ్రవరి 1న అమలు కావాల్సిన ఉరిశిక్ష ని జైలు అధికారులు నిలిపివేశారు.
దీని తో కేంద్రం పై విమర్శలు పెరిగిపోవడంతో ...కేంద్రం ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రయించింది. నిర్భయ దోషులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని.. పవన్ అనే దోషి ఇంకా న్యాయ ప్రక్రియ చేపట్టలేదని తెలిపింది.యితే కేంద్రానికి ఈ విషయంలో హైకోర్టు షాక్ ఇచ్చింది. పాటియాల కోర్టు ఇచ్చిన స్టేకు సమర్థిస్తూ దోషులకు మరో వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ తీర్పును పాటియాలా హౌస్ కోర్టు అనుసరించి.. అమలు చేస్తే మరో వారం రోజుల్లో న్యాయ ప్రక్రియ పూర్తి కావాలి. ఆలా కానీ పక్షం లో మరో తేదీని ప్రకటించి నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీసే అవకాశం ఉంది.