Begin typing your search above and press return to search.
నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత.. ఇక ఉరి నుంచి తప్పించుకోలేరు
By: Tupaki Desk | 2 March 2020 8:45 AM GMTదేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచార కేసులో నిందితులకు విధించిన ఉరిశిక్ష అమలు ఆలస్యమవుతోంది. ఈ శిక్ష అమలులో రోజుకో పరిణామా చోటుచేసుకుంటూ ఉత్కంఠ నెలకొంది. చట్టంలో ఉన్న లొసుగులను వినియోగించుకుంటూ నిందితులు కేసును సాగదీస్తున్నారు. దీంతో వారికి విధించిన ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిర్భయ హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
ఈ పిటిషన్ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు లేవని జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఆర్ఎఫ్ నారిమాన్, భానుమతి, అశోక్ భూషణ్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌ను అంటూ పిటిషన్‌లో పేర్కొంటూ ఉరి నుంచి తప్పించుకోవాలని చూశాడు. దీన్ని గమనించిన ధర్మాసనం అతడి పిటిషన్ ను తిరస్కరించింది. తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ క్యూరేటివ్ పిటిషన్ తన తరఫున న్యాయవాది ఏపీ సింగ్ తో ఆదివారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. నిర్భయ ఘటన జరిగిన రోజు తన వయసు 16 ఏళ్లు రెండు నెలలని అది తన స్కూలు రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఆ పిటిషన్ తిరస్కరించిన అతడు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం పవన్ గుప్తాకు ఇంకా మిగిలే ఉంది.
ఇదిలా ఉంటే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో పవన్ గుప్తా చివరివాడు. చివరి అవకాశం వినియోగించుకుని తప్పించుకుందామనుకుంటే సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఇక మిగతా ముగ్గిరితో పాటు పవన్‌గుప్తాకు కూడా ఉరిశిక్ష అమలు కానుంది. ఇదిలా ఉంటే తమకు విధించిన డెత్‌వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ పవన్ కుమార్ గుప్తాతో పాటు మరో నిందితుడు అక్షయ్ సింగ్‌లు ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కడ పిటిషన్ వేసినా నిందితులకు ఎదురుదెబ్బ తగులుతోంది. చట్టంలో ఉన్న అవకాశాలు ఉన్న వాటిని సద్వినియోగించుకుని ఉరిశిక్ష తప్పించుకోవాలని చూడగా వారు ఉరి నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
ఈ కేసులో మార్చి3వ తేదీన నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి శిక్ష విధించాలని ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17వ తేదీన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముఖేశ్, వినయ్, అక్షయ్ సింగ్ రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా రామ్‌నాథ్ కోవింద్ వాటిని తిరస్కరించారు. తాజాగా పవన్ కుమార్ గుప్తా దాన్నుంచి తప్పించుకునేందుకు క్యూరేటివ్ పిటిషన్ వేయగా వాటిని తిరస్కరించింది. వీటన్నిటి నేపథ్యంలో నిర్భయ ఘటనలో నిందితులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని కుదిరితే మంగళవారం వారికి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది.