Begin typing your search above and press return to search.
సీఎంను చంపేందుకు కుట్ర పన్నారా?
By: Tupaki Desk | 25 Nov 2022 4:12 PM GMTకేంద్రంలో బీజేపీ బలంగా ఉంది. ఎదురించే ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తోంది. ఇక కాంగ్రెస్ సరిగ్గా పోటీనివ్వకుండా చతికిలపడుతుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ సదావకాశాన్ని అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఢిల్లీ నుంచి పంజాబ్ లోనూ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు గుజరాత్ లోనూ పాగా వేస్తోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం మనీష్ సిసోడియా చేసిన సంచలన ఆరోపణలు వైరల్ అయ్యాయి. గుజరాత్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హతమార్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని, అందులో ఢిల్లీ ఎంపీ మనోజ్ తివారీ ప్రమేయం ఉందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భయపడదని సిసోడియా స్పష్టం చేశారు.
"గుజరాత్ ఎన్నికలలో ఓటమి భయం కారణంగా అరవింద్ కేజ్రీవాల్‌ను చంపడానికి బీజేపీ కుట్ర పన్నుతోంది. వారి ఎంపీ మనోజ్ తివారీ తన గూండాలను కేజ్రీవాల్‌పై దాడి చేయమని బహిరంగంగా పిలుపునిస్తున్నాడు. అతను పూర్తి ప్రణాళికతో చేస్తున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి భయపడలేదు. వారి చిల్లర రాజకీయాలు, వారి గూండాయిజానికి ప్రజలు తగిన సమాధానం ఇస్తారు’’ అని ఉప ముఖ్యమంత్రి హిందీలో ట్వీట్ చేశారు.
గుజరాత్ ఎన్నికల్లో అవినీతి, "టికెట్ల అమ్మకం" సాగుతోందని.. కేజ్రీవాల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన తివారీ మాటలు చూస్తుంటే అనుమానంగా ఉందని మనీష్ అన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను ఎందుకంటే ప్రజలు, ఆమ్ ఆద్మీ వాలంటీర్లు నిరంతర అవినీతి, టిక్కెట్ల అమ్మకం , రేపిస్ట్‌తో స్నేహం చేస్తున్నారు. జైల్లో మసాలు చేసుకుంటున్నారు.ఈ ఘటనలపై కోపంగా ఉన్నారు. వారి ఎమ్మెల్యేలు కూడా కొట్టుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి విషయంలో అలా భద్రతపై అనుమానాలున్నాయి’’ అని ఈశాన్య ఢిల్లీ ఎంపీ హిందీలో ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గానే మనీష్ సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.