Begin typing your search above and press return to search.
డిప్యూటీ సీఎం ఆఫీసులో చోరి
By: Tupaki Desk | 30 Dec 2016 11:09 AM GMTఇదో ఆసక్తికరమైన వార్త. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి కార్యాలయంలోనే చోరి జరిగింది. ఓ కంప్యూటర్ - ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు - రిపోర్టులు దొంగతనానికి గురయ్యాయి. ఈ చోరీ జరిగింది ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆఫీస్ లో! ఈ దోపిడికి పాల్పడిన వారు కూడా ప్రొఫెషనల్స్ దొంగల వలే ఉండటం ఆసక్తికరం.
ఢిల్లీలోని పత్పార్ గంజ్ లో గల ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆఫీస్ లో గురువారం రాత్రి ఈ చోరీ జరిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఓమ్ వీర్ సింగ్ వెల్లడించారు. అయితే చోరీ జరిగిన కచ్చితమైన సమయం మాత్రం తెలియదని చెప్పారు. తాళం విరగ్గొట్టి - సీసీటీవీ కెమెరాలు పనిచేయకుండా చేసిన తర్వాత దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆఫీస్ లోని సిబ్బంది చోరీ జరిగిందని చెప్పడంతో పోలీసులు డాగ్ స్క్వాడ్ తో అక్కడికి వచ్చారు. ఫోరెన్సిక్ టీమ్ ఫింగర్ ప్రింట్స్ ను సేకరించినట్లు ఓమ్ వీర్ సింగ్ తెలిపారు. ఆఫీస్ లోని లెటర్ హెడ్స్ - రెండు కంప్యూటర్ల సీపీయూలు మిస్సయినట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పంకజ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ పరిణామంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/