Begin typing your search above and press return to search.

ఢిల్లీ పీఠం మ‌ళ్లీ కేజ్రీవాల్‌ దే! ముంద‌స్తు స‌ర్వేలది ఇదేమాట‌...!

By:  Tupaki Desk   |   8 Jan 2020 10:10 AM GMT
ఢిల్లీ పీఠం మ‌ళ్లీ కేజ్రీవాల్‌ దే!  ముంద‌స్తు స‌ర్వేలది ఇదేమాట‌...!
X
దేశ రాజ‌ధాని, అసెంబ్లీ తో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో ఎన్నిక‌ల న‌గారా మోగిన విష‌యం తెలి సిందే. దేశంలోని మిగిలిన రాష్ట్రాల సీఎంల‌కు ఉండే విస్తృత అధికారాలు లేకున్నా.. ఢిల్లీ సీఎంగా ప్ర‌త్యేక గుర్తింపు, ప‌రిమిత అధికారులు ఉన్నాయి. దీంతో ఢిల్లీలో గ‌ద్దెను సొంతం చేసుకునేందుకు జాతీయ పార్టీ లు స‌హా ప్రాంతీయ పార్టీలుకూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఇక్క‌డ ప్ర‌ధానంగా బీజేపీ, కాంగ్రెస్‌లు గ‌తంలో వ‌రుస‌గా అధికారాలు పంచుకున్నాయి. అయితే, సామాజిక ఉద్య‌మ‌కారుడు అన్నా హ‌జారే శిష్యు డి గా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌య‌మైన ఐఆర్ ఎస్ మాజీ అధికారి అర‌వింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీలో రాజ‌కీయ ప్ర‌భంజ‌నాన్ని సృష్టించారు.

మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీ లో ఎవ‌రికీ అంద‌నంత అంచ‌నాల‌తో 2015లో 67 స్థానాల్లో విజ‌యం సా ధించి అధికారంలోకి వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు ఐదేళ్లు పూర్త‌య్యాయి. దీంతో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు దేశ రాజ ధాని సిద్ధ‌మైంది. వ‌చ్చే నెల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ వెంట‌నే ఫ‌లితాలు కూడా వెలువ‌డ‌తాయి. ఈ నెల 14 న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అయితే, ఇప్పుడు ఇక్క‌డ ఎవ‌రు గెలుస్తారు? ప‌్ర‌ధానంగా అధికార పార్టీ ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య త్రిముఖ పోటీ ఉంటుందా? అనేది చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌దాన విష‌యం. అయితే, ఢిల్లీ లోని 33 నియోజ‌క‌ వ‌ర్గాల్లో ముస్లిం మైనారిటీ వ‌ర్గం ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. దీంతో ప్ర‌స్తుతం బీజేపీ తీసుకువ‌చ్చిన ఎన్నార్సీ పై ముస్లింలు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు.

దీంతో వీరు బీజేపీ కి క‌డుదూరం పాటించే అవ‌కాశం ఉంది. ఇక‌, కాంగ్రెస్ ఇక్క‌డ పుంజుకునే ప‌రిస్తితి లేదు. గ‌తంలో ఇక్క‌డ సీఎంగా ప‌నిచేసిన షీలా దీక్షిత్‌కే అన్ని అధికారాల‌నూ క‌ట్ట‌బెట్టిన కాంగ్రెస్ మ‌రో నేత‌ను త‌యారు చేసుకోలేక పోయింది. ఇప్పుడు ఆమె లేరు. దీంతో ఇక్క‌డ కాంగ్రెస్ ఎవ‌రిని నిల‌బెట్టాలో తెలియ ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోప‌క్క‌, ప్ర‌స్తుత సీఎం కేజ్రీవాల్ అన్ని వ‌ర్గాల‌నూ క‌లుపుకొని పోతున్నారు. ఇంటింటికీ స‌బ్సిడీ పైనా, ఉచితం గా కూడా తాగు నీటిని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. అదే స‌మ‌యం లో మ‌హిళ‌ల‌కు ప్ర‌జా ర‌వాణాలో ఉచిత ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను నేరుగా అందిస్తున్నారు.

ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను అధునాతనం చేశారు., కార్పొరేట్‌కు దీటుగా విద్య‌ను అందిస్తున్నారు. ఇక‌, మ‌హిళా ర‌క్ష‌ణ‌ కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. విద్యుత్‌ను కూడా నిరంత‌రాయం గా ఎలాంటి కోత‌లు లేకుండా అందిస్తున్నారు. దీంతో మెజారిటీ ప్ర‌జ‌లు మ‌రోసారి కేజ్రీకే ప‌ట్టం క‌డ‌తార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. తాజాగా సీ-ఓట‌ర్ సంస్థ చేసిన ముంద‌స్తు స‌ర్వేలోనూ ఇదే త‌ర‌హా ఫ‌లితాలు వ‌చ్చాయి. అయితే గ‌తం లో పొందిన మెజారిటీ స్వ‌ల్పం గా త‌గ్గుతుంద‌ని తాజా స‌ర్వే లో వెల్ల‌డైంది. గ‌తంలో 67 మంది ఎమ్మెల్యేలు ఆప్‌కుద క్కితే.. ఈ ద‌ఫా ఈ సంఖ్య 59కి త‌గ్గుతుంద‌ని అంటున్నారు. అయితే, అధికారం మాత్రం కేజ్రీ కే ద‌ఖ‌లు ప‌డుతుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి