Begin typing your search above and press return to search.

ఢిల్లీలో మరోసారి సరి – బేసి ట్రయల్

By:  Tupaki Desk   |   7 April 2016 4:23 AM GMT
ఢిల్లీలో మరోసారి సరి – బేసి ట్రయల్
X
దేశంలో ఇప్పటివరకూ ఎక్కడా లేని విధంగా వాహన నియంత్రణ విషయంలో ఆ మధ్య ఢిల్లీ సర్కారు చేపట్టిన సరి.. బేసిల వ్యవహారం ఎంతగా విజయవంతం అయ్యిందో తెలిసిందే. సరి.. బేసి అంకెలున్న వాహనాలపై పరిమితులు విధించి.. ముందుగా నిర్ణయించిన వాహనాల్ని మాత్రమే రోడ్ల మీదకు వచ్చేలా నిర్ణయం తీసుకోవటం.. ఈ ప్రక్రియ విజయవంతం కావటం తెలిసిందే.

ట్రాఫిక్ ను కంట్రోల్ చేయటం.. కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ప్రయోగాత్మకంగా చేపట్టిన సరి..బేసి విధానం సక్సెస్ అయిన నేపథ్యంలో.. మరోసారి అదే విధానాన్ని రెండో దఫా అమలు చేయాలని ఢిల్లీ సర్కారు నిర్ణయించింది. గతంలో పదిహేను రోజుల పాటు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానాన్ని మరోసారి చేపట్టాలని.. ఈ నెల 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

సరి.. బేసి విధానంతో పార్చూన్ 50 మందిలో ఒకరిగా స్థానం సంపాదించుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఈ విధానాన్ని మరింత ప్రయోజనకరంగా అమలు చేయాలని భావిస్తున్నారు. రెండో దఫా కూడా పదిహేను రోజుల పాటు చేపట్టనున్నారు. సరి.. బేసి విధానంలో మహిళలు.. యూనిఫాం ధరించిన విద్యార్థులకు మాత్రం మినహాయింపులు ఇస్తారు. మరి.. ఈ దఫా ఢిల్లీ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.