Begin typing your search above and press return to search.
కొత్తగా పెళ్లా.? అక్కడ చచ్చారే..?
By: Tupaki Desk | 17 July 2019 1:30 AM GMTజీవితంలోనే అత్యంత ఘనంగా చేసుకునేది పెళ్లి వేడుక ఒక్కటే. అదో స్టేటస్ సింబల్ గా ప్రస్తుత పరిస్థితుల్లో మారిపోయింది. ఖర్చు వెనుకాడకుండా విచ్చలవిడిగా చేస్తున్నారు. అంబానీలాంటి వాళ్లయితే ఊరువాద అదిరేలా నిర్వహిస్తున్నారు. అయితే ఇక పెళ్లిళ్లు అత్యంత గ్రాండ్ గా చేసుకోకుండా నిబంధనలు పొందుపరిచింది దేశ రాజధాని ఉన్న ఢిల్లీ సర్కారు. పెళ్లికి ఎంత మందిని పిలవాలో, అతిథులకు ఏం వడ్డించాలో.. మిగిలిన పదార్థాలను ఏం చేయాలో అన్నీ వాళ్లే చెబుతారట.. పాటించకపోతే భారీ జరిమానా కట్టాల్సిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఒక ముసాయిదాను సిద్ధం చేశారు.
గ్రాండ్ పెళ్లిళ్ల వల్ల రాజధాని ఢిల్లీలో సమస్యలు వస్తున్నాయని సామాజిక వేత్తల ఆందోళన మేరకు సుప్రీం కోర్టు ఢిల్లీలో వేడుకల నిర్వహణకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించాలని గత డిసెంబర్ లో ఆదేశాలు జారీ చేసింది. ‘పాలసీ ఫర్ హోల్డింగ్ సోషల్ ఫంక్షన్స్ ఇన్ హోటల్స్, మోటాల్స్, డెన్సిటీ రెసిడెన్షియల్ ఏరియా నేషనల్ కాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ పేరుతో డ్రాఫ్ట్ ను రూపొందించారు. సుప్రీం కోర్టు దీనిపై నియమించిన కమిటీకి ఆమోదం తెలిపింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఆహార భద్రతవిభాగం వారు పర్యవేక్షిస్తారు. అనుమతిని హోటళ్లు, ఫంక్షన్ హాల్లు, కేటరర్లు, నిర్వాహకులు తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఆహార పదార్థాలను ఎన్జీవోలకు అందించాల్సి ఉంటుంది.
పెళ్లి వేడుక విస్తీర్ణం, ఎంతమందిని పిలవాలన్నది కూడా స్థానిక సంస్థలే నిర్ణయిస్తాయి. పరిమితికి మించి అతిథులను పిలవడానికి వీల్లేదు. వారికి సరిపడా ఆహారం వండాలి. పర్యవరణానికి ముప్పు వాటిళ్లకుండా చూసుకోవాలి. ఈ నిబంధనలు పాటించకపోతే ఏకంగా 15 లక్షల వరకు ఫంక్షన్ హాళ్లు, నిర్వాహకులు కట్టాల్సి వస్తుంది. ఈ నిబంధనల దెబ్బకు ఇప్పుడు ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలంటేనే జడుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.