Begin typing your search above and press return to search.

ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం .. ఆరు రోజులు లాక్‌డౌన్

By:  Tupaki Desk   |   19 April 2021 7:32 AM GMT
ఢిల్లీ సీఎం సంచలన నిర్ణయం .. ఆరు రోజులు లాక్‌డౌన్
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ లో కరోనా కేసులు వేల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. రోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా మూడు లక్షల దరిదాపుల్లోకి చేరింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.అదేమిటి అంటే .. ఢిల్లీ లో లాక్ డౌన్ అమల్లోకి తీసుకువస్తునట్టు సంచలన ప్రకటన చేశారు. ఆరు రోజుల పాటు క‌ఠిన రీతిలో లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్ల‌డించారు. ఈ రోజు అర్ధ‌రాత్రి 12 గంట‌ల నుంచి వచ్చే సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు లాక్ ‌డౌన్ విధిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలోనూ ఎన్న‌డూ లేని విధంగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. దీనిపై మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌ రోజురోజుకూ భారీ సంఖ్య‌లో కరోనా కేసులు న‌మోదు అవుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. క‌రోనాతో ఇప్ప‌టికే అన్ని రంగాలు దెబ్బ‌తిన్నాయ‌ని , అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా లాక్ ‌డౌన్ విధించాల్సిన ప‌రిస్థితులు వ‌చ్చాయ‌ని తెలిపారు. న‌గ‌రంలో ఆరోగ్య వ్య‌వ‌స్థ చాలా వ‌త్తిడికి లోను అయ్యింద‌ని, వ్య‌వ‌స్థ కుప్ప‌కూల‌కుండా ఉండేందుకు క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అన్నారు. ఢిల్లీలో బెడ్స్ కొర‌త ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు, ఫుడ్ స‌ర్వీసెస్‌, మెడిక‌ల్ స‌ర్వీఎస్ కొన‌సాగుతాయ‌న్నారు. పెండ్లిల్లు కేవ‌లం 50 మందితో నిర్వ‌హించుకోవాల‌న్నారు. ఆ వేడుక‌ల కోసం ప్ర‌త్యేక పాస్‌లు ఇస్తామ‌న్నారు.

ఢిల్లీలో కరోనా పరిస్థితి ఘోరంగా ఉందని, రోజుకు 25 వేల మందికి వైరస్ నిర్ధారణ అవుతోందన్నారు. ఆక్సిజన్, రెమ్‌ డెసివిర్ కొరత ఉందన్నారు. కోవిడ్ పరీక్షలు, కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ప్రస్తుత కష్టకాలంలో ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు సమిష్టిగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నామని, భయపెట్టడం మా ఉద్దేశం కాదని కేజ్రీ పేర్కొన్నారు. అన్ని ప్రయివేట్ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే పనిచేస్తాయని తెలియజేశారు. ప అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని అన్నారు. కరోనా కట్టడికి రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్ ‌డౌన్ నాలుగు రోజుల కిందటే కేజ్రీవాల్ విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. తాను లాక్‌ డౌన్ ‌కు వ్యతిరేకమని, ఒకవేళ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతే చివరి అస్త్రంగా మాత్రమే పరిగణించాలని ఇటీవల కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే , పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని భావించిన సీఎం క్రేజీవాల్ ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధించారు.