Begin typing your search above and press return to search.
రాజధాని కష్టాలు మరో ఐదు రోజులే
By: Tupaki Desk | 10 Jan 2016 5:39 AM GMTఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం సరి-బేసి విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల ప్రజా రవాణాకు ఇబ్బంది కలుగుతోందంటూ పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సరి-బేసి విధానాన్ని ఈ నెల 15 వరకే అమలు చేస్తామని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
జనవరి 15 తర్వాత పరీక్షా సమయాన్ని పొడిగించబోమని, సమీక్ష జరిపిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. వాహనాలపై ఆంక్షలు ఆ తర్వాత కూడా కొనసాగిస్తారన్న వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. హైకోర్టు తుది తీర్పు సోమవారం వెల్లడి కానున్న నేపథ్యంలో తాజాగా మరోమారు విన్నవించింది. ఈ విధానాన్ని అమలు చేసినప్పటి నుంచీ డిల్లీలో వాయు కాలుష్యం తగ్గిందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.