Begin typing your search above and press return to search.
బీజేపీ ఓటమిపై చిదంబరం స్పందన.. కాంగ్రెస్ కు కోపమొచ్చింది!
By: Tupaki Desk | 12 Feb 2020 8:00 AM GMTతాము కిందపడ్డా భారతీయ జనతా పార్టీ చిత్తు అయ్యిందని కాస్త ఆనందించినట్టుగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడటం గురించి చిదంబరం స్పందించారు. బీజేపీ ప్రమాదకర అజెండాను ప్రజలు తిరస్కరించారని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓటమి బీజేపీకి గుణపాఠం కావాలన్నట్టుగా ఆయన స్పందించారు. ఒక బీజేపీ వ్యతిరేకిగా చిదంబరం స్పందన బాగానే ఉండవచ్చు కానీ - ఆయన ఒక కాంగ్రెస్ నేత. అందునా ఆ పార్టీ సీనియర్ నేత కదా - ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గురించి అలా స్పందించడం ఏమిటని ఆ పార్టీ వాళ్లే ఇప్పుడు చిదంబరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ చిత్తు కావడం నిజమే కానీ, కాంగ్రెస్ అంత కన్నా చిత్తు అయ్యింది. ఒకదశలో ఢిల్లీలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా చలామణి అయ్యింది. అలాంటి చోట ఇప్పుడు కనీసం ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటును కూడా కాంగ్రెస్ సాధించలేకపోయింది. అది కూడా వరసగా రెండో సారి!
ఇది కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన అవమానమే. ఇలాంటి పరిణామాల్లో బీజేపీ ఓడిందని చిదంబరం ఆనందంగా ట్వీట్ పెట్టారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారన్నారు. ఈ నేపథ్యం లో చిదంబరం స్పందన పై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు - కాంగ్రెస్ నేత శర్మిష్టా ముఖర్జీ ఘాటుగా స్పందించారు. బీజేపీని ఓడించే పనిని కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలకు అప్పగించిందా? అంటూ ఆమె చిందబరాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అలా అయితే పీసీసీ ఆఫీసులను మూసేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఆప్ విజయం పట్ల కాంగ్రెస్ ఆనందించాల్సిన అవసరం లేదన్నట్టుగా - ఆప్ తరహా విజయాన్ని కాంగ్రెస్ సాధించి, బీజేపీకి చెక్ పెట్టాలన్నట్టుగా శర్మిష్ట అభిప్రాయ పడ్డారు. ఈ విషయం లో చిదంబరం వంటి సీనియర్ నేత ఒపీనియన్ ను కూడా గట్టిగా ఖండించేశారామె.