Begin typing your search above and press return to search.

బీజేపీ ప్ర‌ముఖుడికి కోర్టు షాకిచ్చింది

By:  Tupaki Desk   |   26 Oct 2017 5:21 PM GMT
బీజేపీ ప్ర‌ముఖుడికి కోర్టు షాకిచ్చింది
X
బీజేపీ సీనియ‌ర్ నేత‌ - ఆ పార్టీ ఫైర్‌ బ్రాండ్ సుబ్ర‌మ‌ణ్య‌స్వామికి ఊహించ‌ని స్పంద‌న వ‌చ్చింది. కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ భార్య సునందా పుష్కర్ మరణంపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌ ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. సునందా మృతి కేసులో విచారణ చేపట్టాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. బీజేపీ నేత వేసిన అభ్యర్థన పిటిషన్.. ఓ రాజకీయ ప్రయోజన వాజ్యంలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సునంద హత్య కేసులో బీజేపీ ఎంపీ తన దగ్గర ఉన్న సమాచారాన్ని దాచి పెట్టారని కోర్టు పేర్కొంది. మిస్టరీగా మారిన సునందా మృతి కేసులో ముందుగా సమర్పించాల్సిన అంశాలను సుబ్రమణ్యస్వామి రహస్యంగా ఉంచారని కోర్టు వెల్లడించింది.

కాంగ్రెస్ నేత స‌తీమ‌ణి కేసు విచార‌ణ సాగుతున్న తీరుపై సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ మీడియాలో తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. కేసు విచార‌ణ స‌రైన రీతిలో జ‌ర‌గ‌డం లేద‌ని ఆరోపించారు. కేసు విచార‌ణ‌లో అధికారులు ప‌క్క‌దోవ ప‌ట్టించేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని - దీంతోపాటుగా సునంద భ‌ర్త శ‌శిథ‌రూర్ అబ‌ద్దాలు చెప్పార‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి విమ‌ర్శించారు. పోలీసుల సాగ‌దీత కార్య‌క్ర‌మం వ‌ల్ల కేసు నీరుగారిపోతోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికే అనేక సాక్ష్యాలు నాశ‌నం అయ్యాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేసు విచార‌ణ‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు సీనియ‌ర్ అధికారి నేతృత్వంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేయాల‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి కోరారు. వీట‌న్నింటికంటే సీబీఐ విచార‌ణ స‌రైన‌ద‌ని సుబ్ర‌మ‌ణ్య‌స్వామి అన్నారు. సునంద మృతి కేసు విచారణను తప్పుదోవ పట్టించేందుకు ఎంపీ థరూర్ జోక్యం చేసుకున్నారని స్వామి చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు విభేదించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు స‌రికాద‌న్నారు.